News March 21, 2025

బ్రాహ్మణుడు లేని ఆదర్శ వివాహాలు జరగాలి: యాదగిరి

image

సమాజంలో ఆదర్శ వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాలు మరిన్ని జరగాలని పాశం యాదగిరి, పలవురు వక్తలు అభిప్రాయపడ్డారు. SVKలో నాగర్‌కర్నూల్‌కు చెందిన వెంకటేశ్ (ఎస్సీ) మంచిర్యాలకు చెందిన హారిక (ఎస్టీ) ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి అధ్యక్షతన బ్రాహ్మణుడు, మంత్రాలులేని ఆదర్శ వివాహం జరిపించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పాట పాడి అలరించారు.

Similar News

News March 22, 2025

HYD: ఇన్‌స్టాలో పరిచయం.. హోటల్‌లో అత్యాచారం

image

అల్వాల్ PSలో ఇద్దరు బాలికలు అదృశ్యమైనట్లు ఫిర్యాదు అందింది. దర్యాప్తులో బాలికలు ఓ హోటల్ గదిలో ప్రత్యక్షమయ్యారు. పోలీసుల వివరాలలా.. దమ్మాయిగూడకు చెందిన సాత్విక్ (26), కాప్రాకు చెందిన మోహన్‌చందు (28)లకు మచ్చ బొల్లారానికి చెందిన బాలికలతో ఇన్‌స్టాలో పరిచయం అయింది. యువకుల మాటలు నమ్మి బాలికలు 3 రోజుల క్రితం కుషాయిగూడలోని ఓ హోటల్‌కు వెళ్లగా లైంగికదాడి చేశారు. కేసు నమోదైంది.

News March 21, 2025

పత్రికల్లో కథనాలు తప్పా? నివేదికలు తప్పా?: సీతక్క

image

గ్రామాల్లో తాగునీటి సమస్యలు ఉన్నాయని పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చే తప్పా..? తప్పా? ఏ సమస్యలు లేవంటూ అధికారులు ఇస్తున్న నివేదికలు తప్పా? అని మంత్రి సీతక్క అధికారులను ప్రశ్నించారు. ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి సీతక్క ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాగునీటి సమస్యలు లేకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులకు ఆమె స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

News March 21, 2025

HYD: ఇరుకుగదిలో ‘అంగన్‌వాడీ’

image

అంగన్‌వాడీ కేంద్రాలు పసిప్రాణాలకు నరకప్రాయంగా మారాయి. ఇరుకు గదుల్లో గాలి, వెలుతురు లేక చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. బహదూర్‌పురా మం.లో అనేక కేంద్రాలు అద్దె భవనాలలో నడుస్తున్నాయి. విశాలమైనవి తీసుకోవాలంటే కిరాయి భారం అవుతోంది. ప్రభుత్వం నుంచి అద్దెలు సకాలంలో రాక, టీచర్లు జీతం నుంచే కిరాయి కట్టాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఇకనైనా దీనిపై ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.

error: Content is protected !!