News March 27, 2026
బ్లడ్‌బాత్.. ₹9 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలు చవిచూశాయి. నిఫ్టీ 487 పాయింట్లు కోల్పోయి 22,819 వద్ద, సెన్సెక్స్ 1,690 పాయింట్ల నష్టంతో 73,583 వద్ద ముగిశాయి. దీంతో ఒక్కరోజే ₹9 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. టాటా మోటార్స్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోగా, ONGC, TCS, విప్రో, ఎయిర్‌టెల్, కోల్ ఇండియా షేర్లు లాభపడ్డాయి. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్ఠానికి(94.82) పడిపోయింది.
Similar News
News April 9, 2026
కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో నేడే పోలింగ్

కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఓటింగ్ ఉ.7 గంటలకు ప్రారంభమై సా.6 గంటలకు ముగుస్తుంది. కేరళంలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. కేరళంలో LDF, UDF మధ్య ప్రధాన పోటీ ఉంది. ఇక్కడ పినరయి విజయన్ నాయకత్వంలోని LDF, అస్సాంలో NDA హ్యాట్రిక్‌పై కన్నేశాయి. పుదుచ్చేరిలో NDA, INC-DMK కూటమి మధ్య ప్రధాన పోటీ ఉంది.
News April 9, 2026
అమెరికా-ఇరాన్ సీజ్‌ఫైర్ నిలబడుతుందా?

లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇరాన్, US సీజ్‌ఫైర్ ఒప్పందం ప్రమాదంలో పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘కాల్పుల విరమణ కావాలా లేదా ఇజ్రాయెల్ ద్వారా యుద్ధం కొనసాగిస్తారా? అమెరికా ఏదో ఒకటి ఎంచుకోవాలి’ అని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఒప్పందం లెబనాన్‌కు వర్తించదని US, ఇజ్రాయెల్ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సీజ్‌ఫైర్ డీల్ కొనసాగడం డౌటేనని రాయిటర్స్ పేర్కొంది.
News April 9, 2026
కోమాలో భర్త.. వీర్యం కోసం కోర్టును ఆశ్రయించిన భార్య

ఏడాది కాలంగా కోమాలో ఉన్న తన భర్త వీర్యాన్ని సేకరించి భద్రపరిచేందుకు అనుమతి ఇవ్వాలని ఓ మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ ఉందని వైద్యులు చెప్పడంతో భర్త స్పెర్మ్‌తో భవిష్యత్తులో తల్లయ్యేందుకు అనుమతివ్వాలని ఆమె కోరారు. ఈ ఆరోగ్య పరిస్థితుల్లో వీర్యం సేకరించడం సాధ్యమేనా తెలుసుకునేందుకు ఓ మెడికల్ ఎక్స్‌పర్ట్ కమిటీని వేయాలని పిటిషనర్ కోరారు. దీనిపై ఈరోజు విచారణ జరగనుంది.


