News February 27, 2026

బ్లడ్ బాత్.. ₹5లక్షల కోట్లు ఆవిరి!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 961 పాయింట్లు కోల్పోయి 81,287కు, నిఫ్టీ 317 పాయింట్ల నష్టంతో 25,178 వద్ద స్థిరపడింది. దాదాపు ₹5లక్షల కోట్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్‌లో ట్రెంట్, HCL, ఇన్ఫోసిస్, ఎటర్నల్ మినహా మిగతా షేర్లు అన్నీ నష్టాలతోనే ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ అస్థిరత, FII సెల్లింగ్, US-ఇరాన్ చర్చలు కొలిక్కి రాకపోవడం, రూపీ పతనం ఎఫెక్ట్ చూపించింది.

Similar News

News February 28, 2026

కాకినాడ విషాదం.. ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం

image

AP: కాకినాడ(D) వేట్లపాలెంలో జరిగిన భారీ <<19263594>>పేలుడు<<>> ఘటనలో 20 మంది మృతిచెందడంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.20లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. బాధ్యులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని వేట్లపాలెంలో బాధితులను పరామర్శించిన అనంతరం తెలిపారు.

News February 28, 2026

డూ ఆర్ డై మ్యాచ్.. ఫర్హాన్ సెంచరీ

image

T20WC: సెమీస్ చేరాలంటే భారీ మార్జిన్‌‌తో గెలవాల్సిన మ్యాచులో పాకిస్థాన్ బ్యాటర్లు శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్లు ఫర్హాన్, ఫఖర్ జమాన్(84) పోటాపోటీగా బౌండరీలు బాదారు. ఈ క్రమంలో ఫర్హాన్ 59 బంతుల్లో సెంచరీ బాదారు. తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 5 సిక్సులున్నాయి. మరోవైపు చివర్లో 11 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోవడంతో పాక్ 212/8కి పరిమితమైంది.

News February 28, 2026

హార్ముజ్ నుంచి రవాణా బంద్

image

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ఇతర దేశాల చావుకొచ్చింది. హార్ముజ్ జలసంధి నుంచి రవాణా ఆపేస్తున్నట్లు పలు మేజర్ ముడిచమురు, ఇంధన, నేచురల్ గ్యాస్ కంపెనీలు ప్రకటించినట్లు రాయిటర్స్ తెలిపింది. కొన్నిరోజులు తమ ఓడలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. 30% రవాణా ఈ జలసంధి నుంచే అవుతుండగా ప్రస్తుత పరిణామాలతో వాటి ధరలు భారీగా పెరిగే అవకాశముంది. ఈ ప్రభావం INDపైనా పడనుంది. ఇప్పటికే Gold, Silver ధరలు పెరుగుతున్నాయి.