News February 11, 2026

బ్లాక్ బీన్స్‌తో కలిగే హెల్త్ బెనిఫిట్స్ తెలుసా?

image

✦ ఫైబర్, పొటాషియం, ప్రొటెక్టివ్ యాంటీ ఆక్సిడెంట్లు గుండె హెల్త్‌ను కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు.
✦ రిచ్ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం తగ్గుతాయి.
✦ అధిక ఫైబర్, ప్రొటీన్లు ఆకలిని కంట్రోల్ చేస్తాయి. దీంతో హెల్తీగా బరువు తగ్గుతారు.
✦ యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి.
✦ ప్రొటీన్లు బాడీలోని టిష్యూస్‌ను రిపేర్ చేస్తాయి.
✦ ఐరన్, మెగ్నీషియం, ఫోలేట్ ఆరోగ్యంగా ఉంచుతాయి.

Similar News

News February 12, 2026

ఇది కదా అసలు సిసలైన మతసామరస్యం!

image

కర్ణాటక బస్తెవాడకు చెందిన మెహబూబ్, నూర్జహాన్ దంపతులు మానవత్వానికి గొప్ప ఉదాహరణగా నిలిచారు. ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవరైన మెహబూబ్‌కు ఐదుగురు పిల్లలు. తన స్నేహితుడు, ఆర్టీసీ డ్రైవరైన కాడయ్య, అతడి భార్య మరణించడంతో వారి పిల్లలు సోమశేఖర్, వసంత్‌ను దత్తత తీసుకున్నారు. 20 ఏళ్ల పాటు వారినీ తమ సొంత బిడ్డల్లా పెంచి డిగ్రీ చదివించారు. ఫిబ్రవరి 8న సోమశేఖర్‌కు హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేశారు.

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘పశుపతి’’

image

వేదాల ప్రకారం ‘పశు’ అంటే కేవలం జంతువులు అని మాత్రమే కాదు, అజ్ఞానంతో, మాయతో బంధీ అయి ఉన్న ప్రతి జీవి అని అర్థం. జీవులన్నింటినీ రక్షించే వాడు, వారిని అజ్ఞాన బంధనాల నుంచి విముక్తం చేసే యజమాని శివుడు. మనలోని పశుప్రవృత్తిని(అరిషడ్వర్గాలను) అణచివేసి, మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే రక్షకుడు ఆయనే. సమస్త జీవరాశికి ఆయనే ఆధారభూతుడు. పాలకుడు. అందుకే శివుడిని భక్తులు పరమేశ్వరుడిగా, పశుపతిగా ఆరాధిస్తారు.

News February 12, 2026

నీటి వసతి లేకుంటే పామాయిల్ సాగు వద్దు

image

ఆయిల్ పామ్ సాగును ఎలాంటి నేలల్లో చేపట్టినా నీటి వసతి ముఖ్యం. వర్షాధారంగా ఈ పంట సాగును చేపట్టలేము. అందుకే ఏ రైతైనా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పంట సాగు కోసం మొక్కకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా నీరు అందించి మంచి దిగుబడులను పొందవచ్చు.