News March 15, 2026

బ్లాక్ మార్కెట్‌లో వంట గ్యాస్ సిలిండర్ రూ.6,500

image

వంట గ్యాస్‌ను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరిస్తున్నా అక్రమార్కులు ఆగట్లేదు. NDTV పలు రాష్ట్రాల్లో చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. గ్యాస్ సిలిండర్‌కు ₹6,500, 14KGలు రీఫిల్ చేయడానికి ₹3,500-₹4K వరకు తీసుకుంటున్నారు. స్టవ్ రిపేర్ సెంటర్లు, కిరాణా దుకాణాల ద్వారా ఈ రాకెట్ నడుపుతున్నారు. ఏజెన్సీలే వీరికి బ్లాక్‌లో గ్యాస్ ఇస్తున్నట్లు తేలింది.

Similar News

News April 13, 2026

అది భర్త రక్త మాంసాలను లాక్కోవడమే.. మహిళపై హైకోర్టు ఫైర్

image

నెలకు రూ.లక్షకు పైగా సంపాదిస్తున్న ఓ మహిళ భర్త నుంచి భరణం కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై MP హైకోర్టు మండిపడింది. ఇది భర్త రక్తమాంసాలను లాక్కునే ప్రయత్నమేనంది. మధ్యంతర భరణం నిరాకరిస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును సమర్థించింది. ఈ ఉదంతాన్ని షేక్స్‌పియర్ రచించిన ది మర్చంట్ ఆఫ్ వెనిస్ నాటకంతో పోల్చింది. అందులో ఓ వ్యక్తి అప్పు తీర్చనందుకు అతని శరీరం నుంచి పౌండు మాంసాన్ని వ్యాపారి డిమాండ్ చేస్తారు.

News April 13, 2026

బేబీ మసాజ్‌కు ఈ ఆయిల్స్ ఉపయోగిస్తే మంచిది

image

పిల్లల సంపూర్ణ వికాసానికి తల్లిపాలు ఎంత అవసరమో వారి ఆరోగ్యానికి శరీర మర్దన కూడా అంతే అవసరం. అయితే దీనికోసం ప్లాంట్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవ నూనె వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. శరీరం మీద ఎటువంటి రాషెస్ దద్దుర్లు ఉన్నా కూడా ఈ ఆయిల్ మసాజ్ వల్ల నివారించొచ్చంటున్నారు. బేబీకి ఆయిల్ మసాజ్ చేసేటప్పుడు చేతికి ఎలాంటి ఆభరణాలు ఉండకుండా చూసుకోవాలి.

News April 13, 2026

భారత్‌ చేరుకున్న ఇరాన్ నౌకలు

image

పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్ చమురు నౌకలు రెండు భారత్‌ చేరుకున్నాయి. గుజరాత్‌లోని సిక్కా పోర్టులో ఇవి లంగరేసినట్లు షిప్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. దీంతో ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు వచ్చినట్లయింది. సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌తో మార్చి రెండో వారంలో ఈ రెండు నౌకలు ఖర్గ్ ద్వీపం నుంచి బయల్దేరాయి.