News December 20, 2025
బ్లాక్ మెయింగ్‌కి పాల్పడితే సంప్రదించండి: ADB SP

మహిళలకు గతంలో జరిగిన వాటిని అడ్డుగా పెట్టుకుని బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్న సందర్భాలలో నిర్భయంగా షీ టీం బృందాన్ని సంప్రదించవచ్చని SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గతంలో ప్రేమించి, ప్రస్తుతం ఆ యువకులచే వేధింపబడుతున్న మహిళలు నిర్భయంగా సంప్రదించాలని సూచించారు. షీ టీం అండగా ఉంటూ సహాయాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఆపద వస్తే 8712659953 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
Similar News
News December 23, 2025
ADB: ‘ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి’

ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి తెలియజేశారు. సోమవారం హైదరాబాదు నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొన్నారు. వచ్చే వారంలోగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో వృద్ధి నమోదు కావాలన్నారు. ఫారం-8 ద్వారా అసలైన ఫోటోగ్రాఫ్ సేకరించి నవీకరించాలని సూచించినట్లు శ్యామలాదేవి పేర్కొన్నారు.
News December 23, 2025
ADB: డాక్యుమెంట్ రైటర్‌పై కేసులు

ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో డాక్యుమెంట్ రైటర్‌గా పని చేస్తున్న సుభాష్ నగర్‌కు చెందిన వెన్నం నవీన్ పై 2 కేసులు నమోదు చేసినట్లు 2టౌన్ CI నాగరాజు తెలిపారు. సదానందం 2023లో కొనుగోలు చేసిన ప్లాటుకు సంబంధించిన దస్తావేజుల్లో హద్దులు సరిచేసి ఇవ్వటానికి రూ.లక్ష తీసుకున్నాడు. అదే విధంగా మరొకరి దగ్గర దస్తావేజుల్లోనూ మార్పులు చేయటానికి రూ.56వేలు తీసుకొని ఇబ్బందులకు గురిచేయగా బాధితులు ఫిర్యాదు చేశారు.
News December 23, 2025
ఉట్నూర్: 7 ఏళ్లకు లభించిన భూమి పట్టా

ఉట్నూర్ మండలం తాండ్ర గ్రామానికి చెందిన మండే మల్లారి, సండే సారూబాయ్‌లకు 7 సంవత్సరాలకు భూమి పట్టా లభించిందని ITDA PO యువరాజ్ మర్మాట్ తెలిపారు. సోమవారం పట్టాలను వారికి అందజేశారు. తాండ్ర గ్రామ శివారులో గల 49/23/1/2 సర్వే నంబర్‌లో 5.03 ఎకరాలు, 49/23/3 సర్వే నంబర్‌లో 5.03 ఎకరాల భూమి విస్తీర్ణానికి పట్టా చేసి లబ్ధిదారులకు మంజూరు చేశామన్నారు.


