News December 10, 2025
బ్లాక్ మెయిల్ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండండి: DEO

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్న వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని DEO వెంకట లక్ష్మమ్మ మంగళవారం సూచించారు. ఎటువంటి కాల్స్ వచ్చినా రికార్డ్ చేయాలన్నారు. వాటిని లిఖితపూర్వకంగా సంబంధిత పోలీసులకు అందజేయాలన్నారు. కాల్స్‌కు భయపడి ఎవరికి నగదు చెల్లించవద్దని పేర్కొన్నారు.
Similar News
News March 3, 2026
3,979 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో 3,979 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ITI, టెన్త్ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణ మార్చి 4 నుంచి 7 వరకు చేసుకోవచ్చు. మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెన్త్ అభ్యర్థులకు నెలకు రూ.8200, ITI అభ్యర్థులకు రూ.9600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: recruit-gov.com/
News March 3, 2026
ఉలవ పంటలో బూడిద తెగులు – నివారణ

అధిక తేమ, రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లో ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు ఉలవ పంటలో బూడిద తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి కార్బండిజం 50% W.P 1గ్రామును కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే ఇదే మందును ఇదే మోతాదులో 15 రోజుల వ్యవధిలో రెండోసారి కూడా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News March 3, 2026
VMRDA ఫెసిలిటీ మేనేజర్ పోస్టులకు గడువు పొడిగింపు

VMRDA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యాటక కేంద్రాల నిర్వహణ కోసం ఔట్‌సోర్సింగ్ విధానంలో ఫెసిలిటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తుల గడువును మార్చి 17వ తేదీ వరకు పొడిగించారు. ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ (OR) ఎంబీఏతో పాటు కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలు VMRDA అధికారిక వెబ్‌సైట్ www.vmrda.gov.inలో లభిస్తాయని మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ తెలిపారు.


