News January 31, 2026
బ్లూ ఎకానమీ అభివృద్ధికి విశాఖ కీలకం: జీతేంద్ర సింగ్

దేశ బ్లూ ఎకానమీ అభివృద్ధిలో విశాఖ తీర ప్రాంతం కీలకమని కేంద్ర సహాయ మంత్రి డా. జీతేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఏపీలో వెయ్యి కి.మీ.లకు పైగా తీరం ఉందన్నారు. విశాఖ తీరం దేశ శక్తి భద్రతకు దోహదపడుతుందన్నారు. విశాఖలో తాజాగా ప్రారంభమైన CSIR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కేంద్రం, ONGC, ఆయిల్ ఇండియా సంస్థలతో కలిసి పనిచేస్తూ మత్స్య, పోర్టు, పారిశ్రామిక రంగాలకు శాస్త్రీయ మద్దతు అందిస్తుందని వెల్లడించారు.
Similar News
News February 14, 2026
విశాఖ: అరుదైన రక్తం 57వసారి దానం

విశాఖ స్టీల్ ప్లాంట్ డీజీఎం(సేఫ్టీ) కర్రి శ్రీనివాస్ అరుదైన O-నెగటివ్ రక్తాన్ని 57వసారి దానం చేసి సేవా స్ఫూర్తిని చాటారు. గుండెపోటుతో కేజీహెచ్‌లో శస్త్రచికిత్సకు సిద్ధమైన హిరమండలం ప్రాంతానికి చెందిన రామారావుకు అత్యవసరంగా రక్తం అవసరమవడంతో ఆయన స్పందించారు. అవసరమైన వారికి రక్తం దానం చేయడం సంతృప్తిని ఇస్తోందని ఆయన అన్నారు.
News February 14, 2026
ఆదివారం మాంసం విక్రయాలకు సెలవు: కమిషనర్

నగరంలో మాంసం చేపలు విక్రయాలకు ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాల్లో మాంసం విక్రయాలు చేపట్టవద్దని, దుకాణాలు తెరవవద్దని, నిబంధనలు ఉల్లంఘింస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. అధికారులు వ్యాపారులకు ముందుగానే తెలిపి పర్యవేక్షణ చేయాలని సూచించారు.