News January 1, 2025
భక్తిశ్రద్ధలతో నూతన సంవత్సరానికి స్వాగతం
మంచిర్యాల జిల్లా భీమారంలో అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు. కొమ్ము ప్రభాకర్ స్వామి ఇంటి వద్ద అయ్యప్ప స్వామికి వైభవంగా పూజలు నిర్వహించి అభిషేకాలు చేశారు. అయ్యప్ప స్వాములు భజనలతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. డిసెంబర్ 31ని ఇలా భక్తిశ్రద్ధలతో ముగించి నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉందని భక్తులు తెలిపారు.
Similar News
News January 4, 2025
మందమర్రి: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
మందమర్రి మండలం పులిమడుగు ఫ్లై ఓవర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. మంచిర్యాల ర్యాలీగడ్‌పూర్‌కు చెందిన రాజు(24) భీమిని మండలంలోని భీంపూర్ గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. ప్రమాదం చోటు చేసుకొని చనిపోయినట్లు చెప్పారు.
News January 4, 2025
క్రీడాకారులను అభినందించిన ADB కలెక్టర్
సీఎం కప్ రాష్ట్ర స్థాయిలో పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షిషా అభినందించారు. వివిధ ఆటల్లో జిల్లా క్రీడాకారులు పాల్గొని 43 మెడల్స్ సాధించి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులను శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ అభినందించారు. మెడల్స్, ప్రశాంత పత్రాలు అందజేశారు. డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి తదితరులు ఉన్నారు.
News January 4, 2025
MNCL: రైతుల ఖాతాల్లో రూ.111.24 కోట్లు జమ
మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రూ.111.24 కోట్ల నగదును సంబంధిత రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు అదనపు కలెక్టర్ మోతిలాల్ శుక్రవారం తెలిపారు. 317 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 81,489 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 9,573 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా 185 కేంద్రాల్లో కొనుగోలు లక్ష్యం పూర్తికావడంతో మూసి వేసినట్లు వెల్లడించారు.