News June 15, 2024

భక్తి, త్యాగం, ఐక్యతకు ప్రతీక బక్రీద్: నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీజ్

image

జూన్ 17న బక్రీద్ పండుగ సందర్భంగా ఇరు మత పెద్దలతో ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ సమావేశమయ్యారు. భక్తి భావం, త్యాగం, ఐక్యతకు ప్రతీకగా నిలిచిన బక్రీద్ పండుగను కులమతాలకు అతీతంగా, సామరస్యంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఒకరికొకరు సహకరించుకుంటూ పండుగ జరుపుకుంటామని హిందూ, ముస్లిం మత పెద్దలు ప్రమాణం చేశారు. గోవధ చట్టాలను అనుసరించి పండగ చేసుకోవాలని కోరారు.

Similar News

News January 19, 2025

ఇవాళ సూళ్లూరుపేటకు రానున్న ప్రముఖులు వీరే 

image

సూళ్లూరుపేటలో ఆదివారం ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు నేడు సూళ్లూరుపేటకు రానున్నారు. వారిలో నటి, యాంకర్ అనసూయ, అషు రెడ్డి, యాంకర్ రేణు, సింగర్ గాయత్రి, రఘురామ్, కొరియోగ్రాఫర్ సత్య, చైల్డ్ సింగర్ సాయి వాగ్ దేవి, మిమిక్రీ ఆర్టిస్ట్ షరీఫ్ తదితరులు ఉన్నారు. 

News January 19, 2025

HYD ఓయో రూమ్‌లలో ఉంటూ గంజాయి వ్యాపారం

image

హైదరాబాదు ధూల్‌పేట జాలీ హనుమాన్ దేవాలయం వద్ద ఎక్సైజ్ పోలీసులు దాడులు జరిపారు. వారు మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌కి చెందిన సంజన మాంజా(18), నెల్లూరు జిల్లా కావలికి చెందిన రాజు(25) ఓయో రూమ్‌లలో అద్దెకు ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్నారని వారు తెలిపారు. పక్కా సమాచారంతో దాడి చేసి వారిని పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి 3.625 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

News January 19, 2025

నెల్లూరు: పెరుగుతున్న నిమ్మ ధరలు.. రైతుల్లో ఆనందం

image

రెండు రోజుల నుంచి నిమ్మ ధరలు ఊపందుకున్నాయి. ఇటీవల చలి ప్రభావం ఎక్కువ ఉండడంతో ధరలు ఆశించినంతగా లేక రైతులు ఆందోళన చెందారు. గూడూరు మార్కెట్లో కిలో నిమ్మకాయలు రూ. 25 నుంచి రూ. 35 వరకు పలుకుతున్నాయి. నాణ్యత కలిగిన నిమ్మకాయలు రూ. 45 పలుకుతున్నట్లు రైతులు చెబుతున్నారు. 50 కేజీల లూజు బస్తా రూ. 2,400 నుంచి 3,300 వరకు అమ్ముతున్నారు. నిమ్మ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.