News January 24, 2025
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడండి: నిర్మల్ కలెక్టర్

బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 3 రోజులపాటు జరిగే ఉత్సవాల ఏర్పాట్లపై నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆరా తీశారు. గురువారం వేడుకలు ఆహ్వాన పత్రాన్ని అందజేయడానికి వెళ్లిన ఆలయ అధికారులు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.
Similar News
News September 18, 2025
APPLY NOW: ఇస్రోలో ఉద్యోగాలు

<
News September 18, 2025
ప.గో: ఈ నెల 19న డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మెగా డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19న అమరావతిలో నియామక పత్రాలు అందజేస్తారని జిల్లా విద్యాశాఖాధికారిని ఎం. వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఆ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. అభ్యర్థులందరూ 18న సాయంత్రం 4 గంటలకు ఏలూరులోని రిసీవింగ్ సెంటర్‌కు చేరుకోవాలని, అక్కడి నుంచి 19న అమరావతికి బయలుదేరుతారని ఆమె వెల్లడించారు.
News September 18, 2025
ఉత్తరాఖండ్‌లో పేరేచర్ల యువకుడి మృతి

ఉత్తరాఖండ్‌లోని రుషికేశ్ ఎయిమ్స్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన జగదీశ్‌బాబు (30) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కష్టపడి జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించి, వైద్య సీటు పొందిన జగదీశ్ మృతి పట్ల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.