News December 4, 2025

భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతుల కల్పన: కలెక్టర్

image

దేవదాయ శాఖ పరిధిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ రాజకుమారి చెప్పారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని దేవాలయాల్లో వసతి సౌకర్యాలపై ఎప్పటికప్పుడు ఈఓలతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. మైనార్టీ సంక్షేమ శాఖలో వన్ లాక్ స్కీం అమలు కోసం మార్గదర్శకాలు వచ్చిన వెంటనే కార్యక్రమాలు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.

Similar News

News December 4, 2025

ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటికే స్టేజ్ -1, 2 అధికారుల శిక్షణ పూర్తయిందని, రేపటి నుంచి మిగతవారికి శిక్షణ ఉంటుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా పరిషత్ సీఈఓ జానకి రెడ్డి పాల్గొన్నారు.

News December 4, 2025

ఈ 3 బ్యాంకులు సేఫ్: RBI

image

భారత ఆర్థిక వ్యవస్థకు SBI, HDFC, ICICI బ్యాంకులు మూల స్తంభాలని RBI తెలిపింది. వీటిలో డబ్బు సేఫ్‌గా ఉంటుందని వెల్లడించింది. RBI రూల్స్ ప్రకారం, కామన్ ఈక్విటీ టైర్1 కింద ఎక్కువ నగదు, క్యాపిటల్ ఫండ్ మెయింటైన్ చేయాలి. దీనివల్ల ఆర్థిక సంక్షోభాల సమయంలోనూ బ్యాంక్ కార్యకలాపాలు, అకౌంట్ హోల్డర్ల డబ్బుపై ప్రభావం చూపదు. అందుకే, ఇవి డొమెస్టిక్ సిస్టమికల్లీ ఇంపార్టెంట్ బ్యాంకులు(D-SIB)గా గుర్తింపు పొందాయి.

News December 4, 2025

సూపర్ మూన్.. అద్భుతమైన ఫొటో

image

ఈ ఏడాది ఆఖరి సూపర్ మూన్ ప్రపంచవ్యాప్తంగా కనువిందు చేసింది. భూమికి దగ్గరగా, మరింత పెద్దగా, కాంతివంతంగా చందమామ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను నాసా సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే ఇండియా సహా పలు దేశాల ప్రజలు సూపర్ మూన్‌ను తమ కెమెరాలలో బంధించి పోస్టులు చేస్తున్నారు. కాగా 2042 వరకు చంద్రుడు ఇంత దగ్గరగా కనిపించడని నిపుణులు చెబుతున్నారు.