News February 11, 2026
భక్తులతో మర్యాదగా మెలగండి: ఎస్పీ

శ్రీశైల బ్రహ్మోత్సవాల విధుల్లో ఉన్న సాయుధ బలగాల సిబ్బందికి జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ దిశానిర్దేశం చేశారు. భక్తులతో గౌరవంగా వ్యవహరిస్తూ వారికి మార్గదర్శనం చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఒత్తిడిలోనూ సహనం కోల్పోరాదని సూచించారు. శివభక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News February 20, 2026
మదనపల్లె టమాటా మార్కెట్లో నేడు ధరలు ఇలా..!

మదనపల్లె టమాటా మార్కెట్లో శుక్రవారం 10 కిలోల మేలు రకం టమాటాలు రూ.160, రెండో రకం రూ.150, మూడో రకం రూ.130తో అమ్ముడు పోయినట్లు మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపారు. మొత్తం 57 వేల కిలోల టమాటాలను రైతులు విక్రయానికి తీసుకువచ్చారు. స్థానికంగా ఉన్న వ్యాపారులు, 10 కిలోల మొదటి రకం టమాటాలను రూ. 160 తో కొనుగోలు చేసినట్లు తెలిపారు.
News February 20, 2026
RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News February 20, 2026
‘కాక్‌టైల్ 2’ క్రేజీ అప్‌డేట్.. రష్మిక, కృతి సనన్ లెస్బియన్ రొమాన్స్?

బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘కాక్‌టైల్ 2’లో రష్మిక మందన్న, కృతి సనన్ లెస్బియన్ కపుల్‌గా నటించబోతున్నారనే వార్త ఇప్పుడు సెన్సేషన్‌గా మారింది. షాహిద్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్ ఉంటుందని టాక్. కొత్త రకం పాత్రలు చేసేందుకు రెడీ అవుతున్న ఈ స్టార్ హీరోయిన్ల బోల్డ్ ప్రయోగంపై నెట్టింట చర్చ నడుస్తోంది. septలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని Maddock Films నిర్మిస్తోంది.


