News February 25, 2025
భక్తులపై ఏనుగులు దాడి.. హోంమంత్రి అనిత ఆరా

భక్తులపై ఏనుగుల దాడి చేసిన ఘటనపై హోంమంత్రి అనిత ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లాలోని వైకోట సమీపంలో ఏనుగుల దాడి ఘటనపై ఎస్పీ విద్యాసాగర్‌తో హోంమంత్రి మాట్లాడారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఏనుగుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుండాల కోనకు వెళ్లే భక్తులకు మరింత భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.
Similar News
News February 25, 2025
విశాఖలో మూతపడిన మద్యం షాపులు

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 48 గంటల పాటు మద్యం విక్రయాలను నిలిపేస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విశాఖలో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు ఎక్సైజ్ అధికారులు ప్రతి మద్యం దుకాణం వద్దకు చేరుకొని సీల్డ్ వేసి తాళాలు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో మళ్లీ 27 సాయంత్రం 4 గంటల తర్వాత మద్యం షాపులు తెరుచుకుంటాయని అధికారులు తెలిపారు.
News February 25, 2025
వైసీపీ పాలనలో ఉపాధ్యాయులకు అవమానం: గంటా

గత వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పెట్టి అవమానించిందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విమర్శించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విద్యారంగ అభివృద్ధికి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువర్మ గెలిపించాలన్నారు. పదవిని కాపాడుకోవడానికే జగన్ అసెంబ్లీకి వచ్చారని, తాము గేట్లు తెరిస్తే వైసీపీ నుంచి రావడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారన్నారు.
News February 25, 2025
విశాఖలో ఆర్డీవోకు చుక్కెదురు

విశాఖలోని ఓ దినపత్రికపై మీద ఎదురుదాడి చేసిన అధికార యంత్రాంగానికి హైకోర్టులో చుక్కెదురైంది. లీడర్ దినపత్రిక సంపాదకులు రమణ మూర్తికి ఆర్‌డీవో శ్రీలేఖ ఇచ్చిన నోటీసులను హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర రావు అలాగే ఆర్‌డీవో ఇచ్చిన నోటిస్‌పై 3 వారాలులోగా పూర్తి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.