News October 12, 2025
భక్తుల విశ్వాసాలకు అనుగుణంగనే అభివృద్ధి పనులు: ఆది

రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు భక్తుల విశ్వాసాలు, మనోభావాలకు అనుగుణంగా చేపడతామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం ఆలయ ఆవరణలోని గెస్ట్ హౌస్‌లో ఆయన మాట్లాడారు. శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి, వాస్తు పండితులు, అర్చకులు, పట్టణ ప్రముఖుల సలహాలు, సూచనల మేరకే ఈ పనులకు శ్రీకారం చుట్టామన్నారు.
Similar News
News October 12, 2025
వేరుశనగలో ఇనుపధాతులోపం.. నివారణ

ఆకులలో పత్రహరితం తయారవడానికి ఇనుపధాతు కీలకం. ఇది లోపించినప్పుడు వేరుశనగ మొక్క ఆకులు పసుపు రంగుకు మారతాయి. క్రమంగా ఆకు కొనలు ఎండిపోతాయి. మొక్క ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సమస్య నివారణకు 0.5 శాతంఅన్నబేధి(5గ్రా. లీటరు నీటికి), 0.1 శాతం నిమ్మఉప్పు(లీటరు నీటికి 1గ్రాము) కలిపిన ద్రావణాన్ని 4-5 రోజుల వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేసుకోవాలి.
News October 12, 2025
వరంగల్: 97%తో రికార్డు స్థాయిలో పల్స్ పోలియో

నేటి ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా జరిగింది. మొత్తం 20,101 మంది పిల్లలకు లక్ష్యంగా, 19,546 మందికి పోలియో వ్యాక్సిన్ వేసి 97 శాతం రికార్డు సాధించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.సాంబశివరావు తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు పోలియో చుక్కలు తప్పక వేయించాలన్నారు.
News October 12, 2025
KPHBలో వ్యభిచారం.. అరెస్ట్

KPHB రోడ్డు పక్కన వ్యభిచారం నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడు దీలీప్ సింగ్ (46)ను పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంపై పోలీసులు దాడి చేసి, అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు అతనిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వ్యభిచారం, అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని KPHB పోలీసులు తెలిపారు.