News March 15, 2025

భగభగా మంటున్న కామారెడ్డి

image

కామారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. శుక్రవారం జుక్కల్‌లో 40.6°C ఉష్ణోగ్రత నమోదైంది. పల్వంచ మండలం ఎల్పుగొండలో 40.5, గాంధారి మండలం సర్వపూర్‌లో 40.4, బాన్సువాడ మండలం కొల్లూరు, పిట్లం 40.3, దొమకొండ, మద్నూర్‌ మండలం సోమూర్, కామారెడ్డిలో 40.2, గాంధారి, మద్నూర్‌ మండలం మేనూర్‌లో 40.1, నసురుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్‌పల్లి 40.0°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News November 8, 2025

వరంగల్: సోషల్ మీడియాలో వేధింపులపై మౌనం వద్దు!

image

సోషల్ మీడియాలో వేధింపులపై మౌనం వీడాలని, ఎవరైనా బెదిరిస్తే భయపడొద్దని వరంగల్ సైబర్ పోలీసులు సూచించారు. ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో మాటలు కలిపే ముందు ఆలోచించాలన్నారు. ఎవరినీ నమ్మవద్దని, వ్యక్తిగత సమాచారం, ఫొటోలను, వీడియోలను పంచుకోవద్దని హెచ్చరించారు.

News November 8, 2025

గర్భిణులు-తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు

image

మహిళలు ప్రెగ్నెన్సీ ముందు, తర్వాత కొన్నిటీకాలు తీసుకోవాలి. వీటివల్ల తల్లీబిడ్డకు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నప్పుడే మీజిల్స్, మంప్స్, రుబెల్లా, చికెన్ పాక్స్ వ్యాక్సిన్లు తీసుకోవాలి. తర్వాత HPV, DPT, హెపటైటిస్ బి, కోవిడ్, రెస్పిరేటరీ సిన్సీపియల్ వైరల్ వ్యాక్సిన్లు తీసుకోవాలి. కొందరి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా డాక్టర్లు మరికొన్ని వ్యాక్సిన్లు సూచిస్తారు.

News November 8, 2025

మొదలైన నెల్లూరు DRC మీటింగ్

image

నెల్లూరు జడ్పీ హాల్లో మరికాసేపట్లో జిల్లా సమీక్షా సమావేశం(DRC) మొదలైంది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఫరూక్ ఆధ్వర్యంలో పలు అంశాలపై సమీక్షిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయం, ఇరిగేషన్ అంశాలపై చర్చిస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. తుపాను నష్టంపై చర్చించి ఈనెల 10న జరిగే మంత్రి వర్గ ఉప సంఘానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు.