News March 9, 2025
భట్టిప్రోలు: బంగారంతో ఛాంపియన్స్ ట్రోఫీ తయారీ

అంతర్జాతీయ క్రికెట్ వన్డే ఇంటర్నేషనల్ ఛాంపియన్ ట్రోఫీకి, మండలంలోని ఐలవరం గ్రామానికి చెందిన స్వర్ణకారుడు మాచర్ల వీరేంద్ర 1.60 గ్రాముల బంగారంతో ట్రోఫీకి సంబంధించిన కప్పు, బ్యాట్, పిచ్, వికెట్లను తయారు చేశాడు. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో క్రికెట్ ప్రేమికులను కనువిందు చేసేందుకు ట్రోఫీని పెట్టనున్నట్లు వీరేంద్ర తెలిపారు. క్రికెట్ మీద ఇష్టంతో ఈ ట్రోఫీని తయారు చేసినట్లు వీరేంద్ర తెలిపారు.
Similar News
News March 9, 2025
నల్గొండ: తండ్రి అంతిమ సంస్కారాలు చేసిన కుమార్తె

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో సీపీఐ ఎంఎల్ జనశక్తి సీనియర్ నాయకులు చిట్టూరి సోమయ్య అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుమార్తె తెలంగాణ ఉద్యమ సారథి కళాకారిణి పల్స నిర్మల అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సోమయ్యకు ఒక్కరే సంతానం కావడంతో అన్నీ తానై తన తండ్రి అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ విమలక్కతో పాటు కళాకారులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సోమయ్య మృతితో నకిరేకల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 9, 2025
ప్రయాగ్‌రాజ్‌లో నీరు చక్కగా ఉంది: కాలుష్య నియంత్రణ బోర్డు

కోటానుకోట్ల మంది ప్రయాగ్‌రాజ్ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలాచరించారు. అక్కడి నీటి నాణ్యతపై కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తాజాగా జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదిక సమర్పించింది. గంగ, యమునా నదుల నుంచి కుంభమేళా సమయంలో కలెక్ట్ చేసిన నమూనాలపై పరిశోధనలు జరిపామని, స్నానం చేసేందుకు అనువైనవిగానే ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. కుంభమేళా టైమ్‌లో సంగమం వద్ద నీటి నాణ్యతపై చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
News March 9, 2025
సంగారెడ్డి కలెక్టరేట్‌లో రేపు ప్రజావాణి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రేపు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అధికారులు అందరూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.