News April 10, 2025
భట్టిప్రోలు: మద్యం మత్తులో తల్లిని హతమార్చిన తనయుడు

మద్యం మత్తులో కన్నతల్లిని కడతేర్చినట్లు బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఎస్ఐ ఎం శివయ్య బుధవారం తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. భట్టిప్రోలుకు చెందిన బసవపూర్ణమ్మ(74) పెద్ద కుమారుడు దుర్గారావు మద్యానికి బానిసయ్యాడు. నిత్యం అతను తల్లిని దూషిస్తూ, డబ్బుల కోసం వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఆమె డబ్బులు ఇవ్వకపోవటంతో తల్లిని హతమార్చాడన్నారు. వేమూరు సీఐ వీరాంజనేయులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.
Similar News
News September 18, 2025
ఆసిఫాబాద్‌లో మహిళ అదృశ్యం.. కేసు నమోదు

ఆసిఫాబాద్ మండలం అంకుశాపూర్‌కు చెందిన జంగంపల్లి పద్మ(32) అనే మహిళ అదృశ్యమైనట్లు ఆసిఫాబాద్ సీఐ బాలాజీ వరప్రసాద్ ఈరోజు తెలిపారు. ఈనెల 15న తన పుట్టింటికి వెళతానని భర్త రాజేశ్వర్‌కు చెప్పి వెళ్లిందని, కానీ ఆమె పుట్టింటికి కూడా వెళ్లలేదన్నారు. బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఆసిఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 18, 2025
HYD: ఆచార్య ఎస్వీ రామారావు నిర్యాణం పట్ల తెలుగు వర్సిటీ సంతాపం

తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణంపై దృష్టి పెట్టి పరిశోధన చేసిన గొప్ప సాహితీ వేత్త సూగూరు వేంకటరామారావు అని, వారి నిర్యాణం పట్ల తెలుగు విశ్వవిద్యాలయం ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించింది. OU తెలుగు శాఖ పూర్వాచార్యులుగా, కేంద్రీయ విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం, బెనారస్, బెంగళూరు విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేశారని, ఎస్వీ రామారావు మృతిపట్ల వారి కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు.
News September 18, 2025
VKB: క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలి: VC

తెలుగు వర్శిటీలోని బాచుపల్లి ప్రాంగణంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో పలు విభాగాలలో అధ్యాపకులకు అధ్యాపకేతురులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను ముఖ్యఅతిథిగా ఉపకులపతి(VC) ఆచార్య నిత్యానందరావు హాజరై ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తిని చాటడం ద్వారా భావోద్వేగాలని ఎలా నియంత్రించుకోవాలో తెలుస్తుందన్నారు. స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఆర్.గోపాల్, వర్శిటీ సిబ్బంది తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.