News December 12, 2025

భద్రకాళి అమ్మవారికి అలంకరణ

image

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. దేవస్థాన అర్చకులు తదితరులు ఉన్నారు.

Similar News

News December 12, 2025

ఏలూరు మీదుగా రైళ్ల పెంపు

image

ఏలూరు జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను పెంచుతూ ద.మ రైల్వే ఉత్తర్వులు ఇచ్చింది. సికింద్రాబాద్ – అనకాపల్లి( 07059) ఈనెల 29 నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 వరకూ నడుస్తుంది. అనకాపల్లి – సికింద్రాబాద్ (07060) ఈ నెల 30 – ఫిబ్రవరి 10 వరకు పొడిగించారు. (07035) చర్లపల్లి- అనకాపల్లి JAN 17- FEB 14 వరకు నడుస్తుంది. అనకాపల్లి – చర్లపల్లి (07036) JAN 18- FEB 15 వరకూ పొడిగించారు.

News December 12, 2025

భూపాలపల్లి: ఉప సర్పంచ్ ఎన్నికలు వాయిదా!

image

జిల్లా మొదటి విడతలో గణపురం, రేగొండ, కొత్తపల్లి గోరి, మొగుళ్లపల్లి మండలాల్లోని పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 12 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్ ఎన్నికలు వాయిదా పడినట్లు జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత తెలిపారు. గణపురం మండలంలో 16 పంచాయతీలకు ఆరు, కొత్తపల్లి గోరి మండలంలో 13 పంచాయతీలకు ఒకటి, మొగుళ్లపల్లి మండలంలో 24 పంచాయతీలకు 4, రేగొండ మండలంలో 20 పంచాయతీలకు ఒక చోట ఉపసర్పంచ్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

News December 12, 2025

రాష్ట్రంలో మా ప్రభంజనం మొదలైంది: BRS

image

TG: తొలి దశ పంచాయతీ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజలు షాక్ ఇచ్చారని బీఆర్ఎస్ ట్వీట్ చేసింది. ‘గులాబీ జెండా పల్లెల్లో దుమ్మురేపింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైంది. కాంగ్రెస్ సగం స్థానాలు కూడా గెలవలేకపోయింది. అధికార పార్టీకి ఎదురుగాలి తప్పలేదు. గత సర్పంచ్‌ ఎన్నికల్లో మొదటి విడతలో మా పార్టీ 64% సీట్లు గెలిస్తే, ఇప్పుడు కాంగ్రెస్ 44% సీట్లే గెలిచింది’ అని పేర్కొంది.