News October 19, 2025
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతినిచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Similar News
News October 19, 2025
గత ప్రభుత్వంలో ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి: CM

TG: గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వలేదని, ఇచ్చినా పరీక్షలు పెట్టలేదని సీఎం రేవంత్ విమర్శించారు. HYDలో సర్వేయర్లకు సీఎం లైసెన్సులు అందజేశారు. ‘గత ప్రభుత్వం పోటీ పరీక్షలు పెట్టినా ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరికేవి. TGPSC పునరావాస కేంద్రంగా ఉండేది. మేము రాగానే దాన్ని ప్రక్షాళన చేశాం. ఏడాదిలోనే 60వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశాం’ అని తెలిపారు.
News October 19, 2025
మున్సిపల్ కమిషనర్‌గా మోత్కూరు యువకుడు

పట్టుదల, కృషికి ఫలితం దక్కింది. మోత్కూరుకు చెందిన గుర్రం సాయికృష్ణరెడ్డి గ్రూప్-2 పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. శనివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగిన ‘కొలువుల పండుగ’లో CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ నియామక పత్రాన్ని అందుకున్నారు.
News October 19, 2025
JEE మెయిన్-2026 షెడ్యూల్ వచ్చేసింది

JEE MAIN-2026 <