News October 27, 2025
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధన నిర్వహించగా ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మారుమోగింది. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో సోమవారం కావడంతో భక్తులు ఉపవాస దీక్షలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.
Similar News
News October 27, 2025
వేరుశనగ వరద ముంపునకు గురైతే ఏం చేయాలి?

సాధ్యమైనంత వేగంగా పొలం నుంచి నీటిని తీసివేయాలి. ఈ సమయంలో టిక్కా ఆకుమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. దీన్ని గుర్తిస్తే 200 లీటర్ల నీటిలో టెబుకోనజోల్ 200ml లేదా హెక్సాకొనజోల్ 400ml కలిపి పిచికారీ చేయాలి. రసం పీల్చు పురుగుల నివారణకు లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 0.4ml కలిపి పిచికారీ చేయాలి. ఐరన్ లోపం కనిపిస్తే లీటరు నీటికి ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా.తో పాటు సిట్రిక్ యాసిడ్ 1గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News October 27, 2025
మరోసారి భారత్‌ను రెచ్చగొట్టిన బంగ్లా చీఫ్

బంగ్లా చీఫ్ యూనస్ మరోసారి భారత్‌ను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పాక్ ఆర్మీ జనరల్‌కు ఆయన ప్రజెంట్ చేసిన బుక్ దుమారం రేపింది. ఆ బుక్ కవర్ పేజీపై అస్సాం సహా ఇతర నార్త్‌ఈస్ట్ రాష్ట్రాలను బంగ్లాలో భాగంగా చూపారు. ర్యాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్స్ డిమాండ్ చేస్తున్న ‘గ్రేటర్ బంగ్లాదేశ్’కు యూనస్ మద్దతిస్తున్నట్లు స్పష్టమవుతోంది. కొంతకాలంగా ఆయన నార్త్‌ఈస్ట్ స్టేట్స్‌పై అభ్యంతరకర కామెంట్స్ చేయడం తెలిసిందే.
News October 27, 2025
14,582 పోస్టులు… ఫలితాలు ఎప్పుడంటే…

SSC CGL టైర్1 ఫలితాల విడుదల తేదీపై అభ్యర్ధులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో నవంబర్ చివరి వారంలో ఈ రిజల్ట్స్‌ను ప్రకటించవచ్చని కమిషన్ వర్గాలను ఉటంకిస్తూ టైమ్స్ నౌ పేర్కొంది. NOV25న వచ్చే అవకాశముందని వివరించింది. ఈ పరీక్షల ప్రైమరీ కీపై అక్టోబర్ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. వీటిని పరిష్కరించి ఫలితాలు ప్రకటిస్తారు. సెప్టెంబర్లో జరిగిన ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది హాజరయ్యారు.


