News November 25, 2025
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారికి అర్చకులు మంగళవారం ప్రత్యేకంగా అలంకరించారు. మార్గశిర మాసం, మొదటి మంగళవారం, పంచమి తిథి సందర్బంగా తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
Similar News
News November 25, 2025
WGL: లిక్కర్ షాపులకు మరో రెండు రోజులే..!

ఉమ్మడి జిల్లాలో 294 లిక్కర్ షాపుల లైసెన్స్ గడువు మరో రెండు రోజులే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి పాత మద్యం షాపులకు సరఫరా నిలిపివేసి, 28 నుంచి కొత్త మద్యం షాపులకు లిక్కర్ ఇచ్చేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. డిపోల కేటాయింపు, షాపులకు పేర్లపై డిపో కోడ్‌లను జనరేట్ చేసి QR కోడ్‌లు సిద్ధమవుతున్నాయి. DEC 1 నుంచి కొత్త షాపుల్లో మద్యం అమ్మకాలు జరగనున్నాయి. కొత్త షాపులకు సర్పంచ్ ఎన్నికలు కలిసి రానున్నాయి.
News November 25, 2025
జనగామ: ముక్కిపోతున్న దొడ్డు బియ్యం!

జిల్లాలోని ఆయా రేషన్ డీలర్ల షాపులలో పాత స్టాక్ (దొడ్డు బియ్యం) ముక్కిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేయడంతో మిగిలిపోయిన పాత స్టాక్ మొత్తం పురుగులు పట్టి పాడవుతున్నాయని, ఇప్పటికే 70% మేర బియ్యం పాడైపోయాయని ఆయా షాపుల రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోని బియ్యాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.
News November 25, 2025
కోటంరెడ్డి సోదరుడి కుమార్తె సంగీత్‌లో భారత క్రికెటర్

టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె హరిణ్యా రెడ్డికి గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో మరో రెండు రోజుల్లో వివాహం జరగనుంది. తాజాగా జరిగిన సంగీత్ వేడుకకు రాహుల్ సిప్లిగంజ్ టీం ఇండియా స్పిన్నర్ చాహల్‌ను ఆహ్వానించారు. దీంతో ‘‘నేను చాహల్‌కి వీరాభిమానిని. ఆయన మన సంగీత్‌కు వచ్చారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నా’’ అంటూ హరిణ్య పోస్టు చేశారు.


