News December 1, 2025
భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ

వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం అమ్మవారికి విశేష పూజలు చేసి హారతి ఇచ్చారు. భక్తులు ఉదయం నుంచి ఆలయం చేరుకొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు. సాధారణ భక్తులతో పాటు అయ్యప్ప స్వామి భక్తులతో ఆలయం కిక్కిరిసింది.
Similar News
News December 1, 2025
NZB: అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం గుర్తులు..!

సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్ల ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం గుర్తులను కేటాయిస్తారు. ఓటర్లకు సులభంగా అవగాహన కలిగే గుర్తులు వస్తే బాగుంటుంది. ఎక్కువగా వాడకంలో లేని గుర్తులు వస్తే ఓటర్లకు ఇబ్బంది కలుగుతుంది. ఎక్కువ మంది పోటీలో ఉంటే అనుకున్న గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
News December 1, 2025
Karnataka: మరోసారి ‘బ్రేక్ ఫాస్ట్’ మీటింగ్?

కర్ణాటక ‘CM’ వివాదం నేపథ్యంలో సిద్దరామయ్య, DK శివకుమార్ కలిసి <<18419745>>బ్రేక్‌ఫాస్ట్<<>> చేసిన విషయం తెలిసిందే. రేపు ఉదయం 9.30కు బెంగళూరులో మరోసారి వారిద్దరూ భేటీ అవుతారని తెలుస్తోంది. సిద్దరామయ్యను శివకుమార్ ఆహ్వానించారని సమాచారం. తొలి మీటింగ్ సిద్దరామయ్య నివాసంలో జరగ్గా, రెండోది శివకుమార్ ఇంట్లో నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇద్దరు నేతలు ఇప్పటికే ప్రకటించారు.
News December 1, 2025
విశాఖ: ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలనా దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్

విశాఖపట్నం జిల్లా పరిషత్‌లో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నిర్మూలనా దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ప్రారంభించారు. ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన వారి స్వయం ఉపాధి కోసం మహిళలకు కలెక్టర్ చేతుల మీదుగా కుట్టు మిషన్‌లు అందించారు. అనంతరం ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన చిన్నారులతో కలసి కలెక్టర్ అల్పాహారం తీసుకున్నారు. చిన్నారులతో మాట్లాడి వారి చదువు, యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.


