News April 13, 2025
భద్రకాళి అమ్మవారి ఆదివారం అలంకరణ

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారు ఆదివారం ప్రాతఃకాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు వేదాశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భక్తులు ఉన్నారు.
Similar News
News November 1, 2025
సంగారెడ్డి: ఇంటర్ పరీక్షల షెడ్యూలు విడుదల

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూలు విడుదల చేసినట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం శుక్రవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18వ తేదీ వరకు పరీక్షల జరుగుతాయని చెప్పారు. వార్షిక పరీక్షల కోసం విద్యార్థులను సిద్ధం చేయాలని ప్రిన్సిపల్స్‌కు సూచించారు. ఈ విషయాన్ని అన్ని కళాశాల ప్రిన్సిపల్స్ గమనించాలని కోరారు.
News November 1, 2025
నవంబర్ 1: చరిత్రలో ఈరోజు

1897: రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి జననం (ఫొటోలో ఎడమవైపు)
1956: ఉమ్మడి ఏపీతో పాటు కేరళ, మైసూరు, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, అస్సాం, బెంగాల్ రాష్ట్రాల ఆవిర్భావం
1966: పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఏర్పాటు
1973: నటి, మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ జననం
1974: భారత మాజీ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ జననం
1989: తెలుగు సినీ నటుడు హరనాథ్ మరణం
News November 1, 2025
వరంగల్: ఒకే కాన్పులో మూడు దూడలకు జన్మనిచ్చిన ఆవు!

ఆవుకు ఒకేసారి మూడు దూడలు జన్మించిన ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. అయితే, కృతిమ గర్భం ద్వారా మేలు జాతి రకాలైన దూడలు జన్మిస్తాయని, కృత్రిమ ఏఐ ద్వారా ఈ దూడలు జన్మించాయని గోపాల మిత్ర డా.అక్బర్ పాషా తెలిపారు. దీంతో రైతు సంతోషం వ్యక్తం చేశాడు.


