News November 9, 2025

భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ ఇదే..!

image

ఓరుగల్లు ప్రజల ఇలవేల్పు అయిన భద్రకాళి అమ్మవారికి నేడు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కార్తీకమాసం మూడవ ఆదివారం సందర్భంగా అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి అభిషేకం నిర్వహించి, విశేషంగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. సెలవు దినం కావడంతో ఉదయం నుంచి భక్తులు అధికసంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Similar News

News November 9, 2025

గండేపల్లి: వరి కోత యంత్రానికి విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరి మృతి

image

గండేపల్లి మండలం రామయ్యపాలెం శివారున ఆదివారం విషాదం చోటు చేసుకుంది. వరి కోత కోస్తున్న యంత్రానికి విద్యుత్ వైర్లు తగలడంతో యంత్రంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న రైతులు నివ్వెరపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 9, 2025

అనుపమ ఫొటోలు మార్ఫింగ్.. చేసింది ఎవరో తెలిసి షాకైన హీరోయిన్

image

తన ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పోలీసులను ఆశ్రయించారు. విచారణలో తమిళనాడుకు చెందిన 21 ఏళ్ల అమ్మాయే ఆ పని చేస్తున్నట్లు తెలిసి షాక్ అయినట్లు ఆమె తెలిపారు. ఇన్‌స్టాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మార్ఫ్‌డ్ ఫొటోలు, అసభ్యకర కంటెంట్‌తో తన ఇమేజ్‌ను దెబ్బతీసిందన్నారు. సదరు అమ్మాయిపై లీగల్ చర్యలకు సిద్ధమైనట్లు అనుపమ చెప్పారు.

News November 9, 2025

ఈ వైరస్‌తో బెండ పంటకు తీవ్ర నష్టం

image

బెండ పంటను ఆశించే చీడపీడల్లో ‘ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్’ ప్రధానమైనది. ఈ వైరస్ ఉద్ధృతి పెరిగితే పంట పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మొజాయిక్ వైరస్ సోకిన మొక్కల ఆకులపై పసుపుపచ్చని మచ్చలు లేదా చారలు ఏర్పడతాయి. ఆకుల ఆకారం మారుతుంది. కాండంపై మచ్చలు కనిపిస్తాయి. మొక్కల ఎదుగుదల, కాయల నాణ్యత తగ్గుతుంది. ఈ వైరస్ ఒక మెుక్క నుంచి ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది.