News April 23, 2025

భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి దేవస్థానంలో బుధవారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.

Similar News

News April 23, 2025

గద్వాల: భూభారతి చట్టంపై రైతులకు అవగాహన

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం భూ సమస్యల పరిష్కారానికి కీలకమైందని, రైతులు దీనిపై పూర్తి అవగాహన ఏర్పర్చుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ తెలిపారు. బుధవారం కేటీ.దొడ్డి మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన భూ భారతి చట్టం-2025 అవగాహన సదస్సులో జిల్లా అదనపు కలెక్టర్ పాల్గొని, చట్టం, అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.

News April 23, 2025

హైడ్రా లోగో మార్చిన అధికారులు

image

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(HYDRA) లోగో మారింది. గ్రాన్డియర్ లుక్లో పాత లోగో ఉండగా.. వాటర్ వర్క్స్ విభాగాన్ని తలపించేలా కొత్త లోగో రూపొందించారు. ప్రస్తుతం ఈ కొత్త లోగోనే హైడ్రా తన అధికారిక X అకౌంట్ హ్యాండిల్‌కు DPగా ఉపయోగించింది.

News April 23, 2025

ఓయూ భవనానికి ట్రేడ్ మార్క్ గుర్తింపు

image

ఉస్మానియా యూనివర్సిటీ ముఖచిత్రంగా ఉన్న ఆర్ట్స్ కళాశాల భవనానికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోని ప్రసిద్ధ ట్రేడ్ మార్క్ భవనాల జాబితాలో నిర్మాణ శైలి చోటు దక్కించుకుంది. ముంబైలోని తాజ్‌హోటల్, స్టాక్ ఎక్స్ఛేంజ్ భవనాల తర్వాత ట్రేడ్ మార్క్ కలిగిన 3వ కట్టడంగా ఆర్ట్స్ కళాశాల భవనం నిలిచింది.

error: Content is protected !!