News May 7, 2025

భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

image

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి భద్రకాళి దేవస్థానంలో చైత్ర మాసం శనివారం ఆలయ అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు ఆలయానికి చేరుకొని భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులున్నారు.

Similar News

News April 14, 2026

గొప్ప ఆర్థికవేత్త అంబేడ్కర్!

image

భారత రాజ్యాంగ నిర్మాతగా అందరికీ తెలిసిన Dr.BR అంబేడ్కర్ గొప్ప ఆర్థికవేత్త కూడా. 1923లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో డాక్టరేట్ కోసం ఆయన రాసిన ‘ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ’ పుస్తకం IND, బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి దోహదపడింది. దేశంలో RBI ఏర్పాటుకూ సహకరించింది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్థిక దోపిడీ, భారతీయులను ఆర్థిక బానిసలుగా మార్చిన తీరును తన పరిశోధనలతో ప్రపంచానికి చాటారు. ఇవాళ ఆ మహనీయుడి జయంతి.

News April 14, 2026

విజయవాడలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. రూ. 7 లక్షలు హాంఫట్!

image

విజయవాడలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో కేటుగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారుడికి ఫోన్ చేసిన దుండగులు.. అతని ఆధార్ నంబర్‌కు మానవ అక్రమ రవాణా కేసుతో సంబంధం ఉందని భయపెట్టారు. తాము పోలీసులమని నమ్మబలికి, కేసు నుంచి బయటపడాలంటే డబ్బు ఇవ్వాలని బెదిరించడంతో బాధితుడు రూ. 7 లక్షలు సమర్పించుకున్నాడు. బాధితుడి ఫిర్యాదుతో మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 14, 2026

క్రీమ్ బిస్కెట్లు తింటున్నారా?

image

అందరూ ఇష్టంగా తినే క్రీమ్ బిస్కెట్లు ఆరోగ్యానికి మంచివి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు బిస్కెట్లను అతికించేందుకు సింథటిక్ ఎమల్సిఫయర్స్‌ను రేప్ సీడ్ ఆయిల్‌తో కలిపి క్రీమ్‌ను తయారుచేస్తారంటున్నారు. ‘వీటిని ఎక్కువగా తింటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి డయాబెటిస్, ఫ్యాటీ లివర్, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సింథటిక్ గుండె రక్తనాళాలను మూసుకుపోయేలా చేస్తుంది’ అని పేర్కొంటున్నారు.
#ShareIt