News November 1, 2025
భద్రకాళి అమ్మారిని దర్శించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ

వరంగల్ కొంగు బంగారమైన భద్రకాళి అమ్మవారిని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 1, 2025
పోలవరం నిర్వాసితులకు ₹1,000 కోట్ల పరిహారం.. నేడే పంపిణీ

AP: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పునరావాసం కింద మరో రూ.వెయ్యి కోట్లను వారికి చెల్లించనుంది. నేడు ఏలూరు జిల్లా వేలేరుపాడులో జరిగే కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు వారికి చెక్కులను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా తెరిచిన ఖాతా నుంచి లబ్ధిదారులకు సొమ్ము జమ కానుంది. ఈ ఏడాది జనవరిలో కూడా ప్రభుత్వం రూ.900 కోట్లను నిర్వాసితులకు విడుదల చేసింది.
News November 1, 2025
ASF: విద్యా సంస్థలలోమౌలిక వసతులు కల్పించాలి

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలలో విద్యార్థులకు సకల మౌలిక వసతులు కల్పించి నాణ్యమైన విద్యా బోధన అందించాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, విద్యాశాఖ అధికారులతో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
News November 1, 2025
కొబ్బరిపాలతో చర్మ సంరక్షణ

వంటల్లో ఎక్కువగా వాడే కొబ్బరి పాలు సౌందర్య సంరక్షణలో కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, కాపర్ చర్మంపై మృతకణాలను తొలగిస్తాయి. దాంతో పాటు ముడతలు, మచ్చలు తగ్గించి యవ్వన చర్మాన్ని ఇస్తాయి. మొటిమలు, ఎగ్జిమా, సొరియాసిస్ వంటి చర్మ సమస్యలను తగ్గిస్తాయని చెబుతున్నారు. అలాగే వీటిని జుట్టుకు పట్టిస్తే కుదుళ్లను దృఢంగా చేస్తాయని చెబుతున్నారు.


