News August 30, 2025
భద్రకాళి ఆలయానికి నూతన ఈవో

వరంగల్ భద్రకాళి ఆలయానికి నెల తిరగకముందే నూతన ఈవోను రాష్ట్ర దేవాదాయ శాఖ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈవో సునీతను తప్పించి, సీనియర్ అధికారిణి సంధ్యారాణిని ఈవోగా నియమించింది. గతంలో ఐదున్నర ఏళ్ల పాటు పనిచేసిన సునీత నెల రోజులు తిరగకముందే ఆమె స్థానాన్ని మార్చడంపై రాజకీయ నేతల హస్తం ఉందని మాట్లాడుకుంటున్నారు. సునీతపై రాష్ట్ర ఎండోమెంట్ అధికారులకు సైతం కొన్ని ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం.
Similar News
News August 30, 2025
మెదక్: రాజకీయ పార్టీ నాయకులతో కలెక్టర్ మీటింగ్

మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాపై కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయితీలలో ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వత తేదీ వరకు స్వీకరిస్తామన్నారు.
News August 30, 2025
హిందూ ధర్మంలో సంస్కారాలు ఏవి..?

సమాజ హితం, మానవ వికాసం కోసం రుషులు హిందూ ధర్మంలో 16 సంప్రదాయాలను సంస్కారాలుగా గుర్తించారు. అవి.. 1. పెళ్లి, 2. గర్భాధారణ, 3. పుంసవనం, 4. సీమంతం, 5. జాతకర్మ, 6. నామకరణం, 7. అన్నప్రాశన, 8. చూడాకర్మ, 9. నిష్క్రమణ, 10. ఉపనయనం, 11. కేశాంతం, 12. సమావర్తనం, 13. కర్ణభేదం, 14. విద్యారంభం, 15. వేదారంభం, 16. అంత్యేష్టి.
ఈ షోడశ సంస్కారాల విశిష్టతను ఒక్కో రోజు ఒక్కోటిగా తెలుసుకుందాం.
News August 30, 2025
తంగళ్ళపల్లి: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని మానేరు వాగులో గుర్తుతెలియని మగ మనిషి శవం లభ్యమైనట్టు ఎస్ఐ ఉపేంద్ర చారి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. మానేరు వాగు వద్ద కిషన్ అనే రైతు మృతదేహం ఉందని గ్రామ కార్యదర్శి ప్రశాంత్ సమాచారం ఇచ్చారన్నారు. కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం ఖననం చేశామన్నారు. మృతుడు సుమారు నెల రోజులు క్రితం చనిపోయినట్లుగా ఉందన్నారు.