News February 27, 2025

భద్రకాళి చెరువులో రుద్రమదేవి.. AI PHOTO

image

సినిమా హీరోలు, రాజకీయ నాయకులు, ఇతర చారిత్రాత్మక కట్టడాలకు సంబంధించిన ఏఐ ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భద్రకాళి చెరువు మధ్యలో రాణి రుద్రమ దేవి విగ్రహం, చుట్టూ కోట కనిపించేలా జనరేట్ చేసిన ఓ ఏఐ ఫొటో ప్రస్తుతం ఓరుగల్లు ప్రజలను ఆకట్టుకుంటోంది. అది చూసిన వారంతా చెరువులో రుద్రమదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Similar News

News February 27, 2026

గంగా జలం ఇంటికి తెచ్చుకుంటున్నారా?

image

గంగా జలం ఇంట్లో ఉంటే చాలా మంచిది. అయితే పుణ్య క్షేత్రాల నుంచి ఆ జలాన్ని తెచ్చేటప్పుడు చాలామంది ప్లాస్టిక్ బాటిళ్లు వాడుతుంటారు. దాని బదులు ఇత్తడి పాత్రలు వాడితే ఆ జలంలోని ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ‘గంగా జలం వాస్తు దోషాలను, ప్రతికూల శక్తులను పోగొడుతుంది. గ్రహణాల తర్వాత, శుభకార్యాలప్పుడు ఇంటిని శుద్ధి చేయడానికి దీనిని ప్రోక్షించడం వల్ల సానుకూలత పెరుగుతుంది’ అంటున్నారు.

News February 27, 2026

“చద్దిలేని పయనం, ఒంటి ఎద్దు సేద్యం”

image

పూర్వం కాలినడకన, ఎడ్లబండ్ల మీద ప్రయాణాలు చేసేవారు. అప్పట్లో హోటల్స్ ఉండేవి కావు. అప్పుడు తిండి లేకుండా చాలా దూరం ప్రయాణించాల్సి వస్తే ఆకలితో అలమటించి నీరసించిపోయేవారు. అలాగే వ్యవసాయానికి జత ఎడ్లు ఉండాలి. ఒక ఎద్దు కట్టి పొలం దున్నడం అసాధ్యం. ఒకవేళ చేసినా అది కష్టంగా మారుతుంది. అందుకే ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు సరైన ప్రణాళిక, వనరులు, అవసరమైన సాయం లేకపోతే అది విజయవంతం కాదని ఈ సామెత చెబుతుంది.

News February 27, 2026

బుమ్రాను దాటేసిన అర్ష్‌దీప్.. T20 WC చరిత్రలో సరికొత్త రికార్డు

image

T20 WC చరిత్రలో టీమ్‌ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అర్ష్‌దీప్ సింగ్ రికార్డు సృష్టించారు. జింబాబ్వేతో జరిగిన కీలక మ్యాచ్‌లో 3 వికెట్లు పడగొట్టిన అర్ష్‌దీప్.. బుమ్రా (33 వికెట్లు)ను అధిగమించి 35 వికెట్లతో అగ్రస్థానానికి చేరుకున్నారు. కేవలం 19 మ్యాచుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో 150 వికెట్ల మైలురాయిని కూడా దాటారు.