News January 9, 2026
భద్రకాళి లేక్‌పై రోప్ వేకు అడుగులు!

WGLలోని భద్రకాళి లేక్‌పై రోప్ వే కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పీపీపీ పద్దతిలో 12 నెలల్లో నిర్మించి, 33 ఏళ్ల పాటు లీజు పద్దతిలో ఇవ్వడానికి ప్రతిపాదించింది. రోప్ వేను 1030 మీటర్ల దూరం నిర్మించనున్నారు. గ్లాస్ బ్రిడ్జి స్కైవాక్ 230 మీ.కు రూ.14.50 కోట్లు, రోప్ ద్వారా 800 మీ.కు రూ.65.54 కోట్లు.. మొత్తం రూ.77.04 కోట్లతో నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 45 రోజుల్లో ఫైనల్ చేసేలా రెడీ అవుతున్నారు.
Similar News
News February 7, 2026
సిద్దిపేట: పురపోరు.. సామాజిక ఓట్లపై పార్టీల గురి!

జిల్లాలో జరుగుతున్న గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల, దుబ్బాక మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపునకు అవసరమైన మార్గాల్లో కీలకమైన సామాజిక వర్గాల ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. సామాజిక వర్గాల పెద్దల దగ్గరకు వెళ్లి సంప్రదింపులు జరుపుతున్నారు. గెలిస్తే సంఘాలకు, భవనాలకు అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు.
News February 7, 2026
‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ వెనుక అర్థం ఇదేనా?

USను ఇరుకున పెట్టి టారిఫ్‌లను తగ్గించే వ్యూహంలో భాగంగానే EUతో భారత్ FTAపై సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. 50% సుంకాలు విధించి, ఇంకా పెంచుతామని ట్రంప్ పదే పదే హెచ్చరించి మనకు మంచే చేశారని విశ్లేషకులు చెబుతున్నారు. అలా చేయకుంటే ప్రత్యామ్నాయాలకు IND ప్రయత్నించేది కాదని అభిప్రాయపడుతున్నారు. EU ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’గా ప్రధాని మోదీ సంబోధించడం వెనుక ఇంత కథ ఉందా అని SMలో కామెంట్లు వస్తున్నాయి.
News February 7, 2026
‘గీతం భూముల వ్యవహారంలో బాధ్యులపై చర్యలకు డిమాండ్’

వైసీసీ ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, వరుదు కళ్యాణి, విశాఖ మాజీ మేయర్ గొలగాని హరికుమారి తాడేపల్లిలో మాట్లాడుతూ గీతం సంస్థల ఆధీనంలోని 54.79 ఎకరాల ప్రభుత్వ భూమి రెగ్యులరైజేషన్‌ను జీవీఎంసీ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించారని ఆరోపించారు. ఈ నిర్ణయంపై బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి పత్రం సమర్పించారు.


