News July 10, 2025
భద్రకాళి శాకాంబరీ ఉత్సవాలకు భారీ బందోబస్తు

వరంగల్ భద్రకాళి ఆలయంలో నిర్వహిస్తున్న శాకాంబరీ ఉత్సవాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం ఉత్సవాలకు చివరి రోజు కావడంతో భక్తులు భారీగా పోటెత్తనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా 250 మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా మట్టెవాడ సీఐ గోపి ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు చేశారు.
Similar News
News July 10, 2025
అనుమతి లేకుండా ఇతరుల ఫొటోలు షేర్ చేస్తున్నారా?

బెంగళూరులో అనుమతి లేకుండా యువతి వీడియోను తీసి SMలో షేర్ చేసిన 26 ఏళ్ల యువకుడు అరెస్టయ్యాడు. యువతి ఫొటోలు, వీడియోలు అసభ్య కామెంట్లతో వైరలవ్వగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 66E ప్రకారం ఇతరుల ఫొటోలను SMలో వారి అనుమతి లేకుండా షేర్ చేయడం నేరం. దీని ప్రకారం గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
News July 10, 2025
రైతులు మీకు దొంగలు, రౌడీలుగా కనిపిస్తున్నారా?: జగన్

AP: మామిడి రైతులు సీఎం చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా కళ్లకు దొంగలు, రౌడీల్లాగా కనిపిస్తున్నారా? అని మాజీ CM జగన్ మండిపడ్డారు. రైతులకు అండగా నిలవకపోగా వారిపై వెకిలి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బాబు పాలకుడు అని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. 76 వేల రైతు కుటుంబాల సమస్యను గాలికొదిలేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని రైతులకు అండగా నిలబడండి’ అంటూ ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
News July 10, 2025
విద్యార్థులతో నంద్యాల కలెక్టర్

వెలుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘మెగా పీటీఎం’లోగోతో రూపొందించిన ఫొటో ఫ్రేమ్ వద్ద విద్యార్థులతో కలిసి కలెక్టర్ ఫొటోలు దిగారు. బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు.