News September 14, 2025
భద్రత, పరిశుభ్రతలో రాజీపడే ప్రసక్తే లేదు: కలెక్టర్

ప్రయాణికుల భద్రత, బస్టాండ్ పరిశుభ్రతలో రాజీపడే ప్రసక్తే లేదని కలెక్టర్ లక్ష్మీశా పేర్కొన్నారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్లాట్‌ఫామ్‌లతో పాటు తాగునీటి పాయింట్లు, మరుగుదొడ్ల పరిసరాలను పరిశీలించారు. ఏ సమయంలోనైనా అపరిశుభ్రత అనే మాట వినిపించకూడదన్నారు. ప్రయాణికుల ఆహార భద్రతకు భరోసా కల్పించేలా పరిశుభ్రతా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News September 14, 2025
బాపట్ల ఎంపీకి 05వ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ MPల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో బాపట్ల MP హరికృష్ణ ప్రసాద్ 5వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 73 ప్రశ్నలు అడిగారు. 14 చర్చల్లో పాల్గొన్నారు. ఆయన హాజరు శాతం 86.76గా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి. ఆయన పనితీరుపై మీ కామెంట్..!
News September 14, 2025
ఎటెండెన్స్‌లో VZM ఎంపీకి ఫస్ట్ ర్యాంక్

లోక్ సభలో ఎంపీల పెర్ఫామెన్స్ రిపోర్ట్‌ను పార్లమెంట్ విడుదల చేసింది. 2024 జూన్ 24 నుంచి 2025 ఏప్రిల్ 4వ తేదీ వరకు ఎంపీలు పాల్గొన్న డిబెట్‌లు, అడిగిన క్వశ్చన్స్, ఎటెండెన్స్ ఆధారంగా ఈ ర్యాంక్‌లను ఇచ్చింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు క్వశ్చన్స్, ఎటెండెన్స్ కేటగిరీల్లో తొలిస్థానంలో నిలిచారు. ఓవరాల్ ర్యాంక్‌లో ఫోర్త్ ప్లేస్ వచ్చింది.
News September 14, 2025
‘నానో బనానా’ మాయలో పడుతున్నారా?

‘నానో బనానా’ మాయలో పడి వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్‌లో షేర్ చేయొద్దని TGSRTC MD సజ్జనార్ సూచించారు. ఒక్క క్లిక్‌తో బ్యాంకు ఖాతాల్లోని డబ్బంతా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుందని ట్వీట్ చేశారు. ‘ట్రెండింగ్స్‌ల్లో మీ ఆనందాన్ని పంచుకోవచ్చు. కానీ భద్రతే తొలి ప్రాధాన్యమనే విషయం గుర్తుంచుకోవాలి. ఫేక్ సైట్లలో పర్సనల్ డేటా అప్లోడ్ చేసేముందు ఆలోచించాలి. మీ డేటా.. మీ డబ్బు.. మీ బాధ్యత’ అని తెలిపారు.