News April 6, 2025
భద్రాచలంలో ఉదయం.. ముత్తారంలో సాయంత్రం కళ్యాణం

ముదిగొండ మండలం ముత్తారంలోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం సాయంత్రం రాములోరి కళ్యాణం జరగనుంది. భద్రాచలంలో ఉదయం సీతారామ కళ్యాణం జరగగా, ఇక్కడ మాత్రం సాయంత్రం వేళలో సీతారాముల కళ్యాణం జరగడం విశేషం. భద్రాచలంలో జరిగిన కళ్యాణం అక్షింతలను ముత్తారానికి తీసుకొచ్చి కళ్యాణ తంతు నిర్వహిస్తారు. ఖమ్మం, సూర్యాపేట జిల్లాల నుంచి భక్తులు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలిరానున్నారు.
Similar News
News April 13, 2025
ఖమ్మం జిల్లా చెట్టంత గొప్ప మనిషిని కోల్పోయింది.!

ఖమ్మం జిల్లా చెట్టంత గొప్ప మనిషిని కోల్పోయింది. పర్యావరణ పరిరక్షణ కోసం పద్మశ్రీ వనజీవి రామయ్య చేసిన కృషి వెలకట్టలేనిది. దాదాపు కోటిన్నర మొక్కలు నాటారు రామయ్య-జానకమ్మ దంపతులు. ఆయన పర్యావరణ సేవలకు గాను 3వేల ప్రభుత్వ, ప్రైవేటు అవార్డులు వరించాయి. ఆయన మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖులు విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వనజీవి రామయ్యకు నివాళి అంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడమే.. ఏమంటారు?..
News April 13, 2025
KMM: తెల్లవారుజామున ప్రమాదం.. యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. నేలకొండపల్లి మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల సమీపంలో హైవేపై ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని బైక్ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
News April 13, 2025
ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

ఖమ్మం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. చికెన్ (విత్ స్కిన్) కేజీ రూ.220 ఉండగా, స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.250 ధర పలుకుతుంది. అలాగే లైవ్ కోడి రూ.160- 170 మధ్య ఉంది. కాగా బడ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో గత నెల క్రితం భారీగా అమ్మకాలు పడిపోగా.. ప్రస్తుతం అమ్మకాలతో పాటు ధర సైతం పెరిగిందని నిర్వాహకులు చెబుతున్నారు. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?..