News March 26, 2026
భద్రాచలంలో డీజీపీకి ఘనస్వాగతం

భద్రాచలంలో శుక్రవారం జరిగే శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర DGP శివధర్ రెడ్డికి SP రోహిత్ రాజు గురువారం ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్మడ్ రిజర్వ్ పోలీసుల నుంచి DGP గౌరవవందనం స్వీకరించారు. అనంతరం రామయ్య కళ్యాణ వేడుకల భద్రతా ఏర్పాట్లపై SPతో సమీక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News April 14, 2026
పాలమూరు: ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్

నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామపంచాయతీ గ్రేడ్-IV కార్యదర్శి కిషన్, కొల్లాపూర్ మండలంలోని సింగోటం పంచాయతీ గ్రేడ్-3 కార్యదర్శి అర్జునయ్య, అంకిరావుపల్లి పంచాయతీ గ్రేడ్-3 కార్యదర్శి ప్రేమ్ చంద్‌లను విధుల నుంచి తొలగించారు.
News April 14, 2026
మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలు

మార్కాపురంలో అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా కలెక్టర్ విజయ సునీత మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఫైర్ ఎక్యూప్మెంట్ స్టాల్‌ను, పాంప్లెట్లు, పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ ఆర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
News April 14, 2026
ఎన్నికలు ముగిశాక పెట్రోల్ రేట్లు పెంచే అవకాశం: Macquarie

క్రూడాయిల్ ధరలు పెరిగినా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచకపోవడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు భారీగా నష్టపోతున్నాయని Macquarie అనే గ్రూప్ తెలిపింది. బ్యారెల్ ధర 135-165 డాలర్ల మధ్య ఉంటే లీటర్ పెట్రోల్‌పై రూ.18, లీటర్ డీజిల్‌పై రూ.35 చొప్పున నష్టాలు వస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ చివర్లో తమిళనాడు, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచే అవకాశం ఉందని అంచనా వేసింది.


