News January 30, 2025
భద్రాచలంలో 82 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలం చెక్పోస్ట్ వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తున్న నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ అధికారులకు కారులో సుమారు 81.950 కేజీల ఎండు గంజాయిని గుర్తించారు. కారులో ఉన్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను, గంజాయి, కారును భద్రాచలం పోలీసులకు విచారణ నిమిత్తం అప్పగించారు.
Similar News
News March 14, 2025
కామారెడ్డి: అక్కడ హోలీ పండగొస్తే గుండు ఎత్తాలి..!

హోలీ పండగను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా నిర్వహిస్తారు. కాగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామంలో హోలీ పండుగను విభిన్నంగా నిర్వహిస్తారు. గ్రామంలోని ప్రజలంతా ఒక చోట చేరి పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని సంబరాలు నిర్వహిస్తారు. అనంతరం ఆనవాయితీగా వస్తున్న బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తారు. ఈసారి 95 కేజీల గుండును ఎత్తాలని పోటీ పెట్టగా యువకులు పాల్గొన్నారు.
News March 14, 2025
జన్మత: పౌరసత్వం అమలుపై సుప్రీంకోర్టుకు ట్రంప్ పాలకవర్గం

జన్మత: పౌరసత్వంపై ఆంక్షలను పరిమితంగా అమలు చేసేందుకు అనుమతించాలని డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గం సుప్రీంకోర్టును కోరింది. దేశవ్యాప్తంగా ప్రెసిడెంట్ ఆర్డర్‌ను అడ్డుకొనే అధికారం జిల్లా కోర్టులు, ఇండివిడ్యువల్ జడ్జిలకు లేదని తెలిపింది. న్యాయపోరాటం చేస్తున్నవారిని మినహాయించి ట్రంప్ ఆదేశాల అమలుకు అనుమతించాలని కోరింది. USలో అక్రమ నివాసితులకు పుట్టిన పిల్లలకు పౌరసత్వం ఇవ్వకుండా ట్రంప్ ఆదేశించడం తెలిసిందే.
News March 14, 2025
సిద్దిపేట: మార్చిలోనే మండుతున్న ఎండలు

సిద్దిపేట జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లాలో 36 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. దీంతో నిప్పుల కొలిమిని తలపిస్తుండటంతో మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దీంతో రోడ్డు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్చిలోనే ఎండలు ఇలా ఉంటే వచ్చే ఎప్రిల్, మేలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు భయపడుతున్నారు. ఎండలో వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు చెబుతున్నారు.