News March 13, 2025
భద్రాచలం: ఆన్‌లైన్‌లో టికెట్లు బుకింగ్

భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 6, 7 తేదీల్లో జరిగే కళ్యాణం, మహా పట్టాభిషేకం ఉత్సవాలకు బుధవారం నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. htts://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 20వ తేదీ ఉదయం 11 నుంచి ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు తానీషా కళ్యాణ మండపంలో టికెట్లు పొందాలని సూచించారు.
Similar News
News March 6, 2026
ఖమ్మం: వేసవి దాహార్తి తీర్చేలా పక్కా ప్రణాళిక

ఖమ్మం జిల్లాలో రాబోయే వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు కసరత్తు ప్రారంభించారు. మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయిలో బావులు, బోర్లను పరిశీలిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ వంద లీటర్ల నీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా నిరుపయోగంగా ఉన్న 863 చేతి పంపులు, 20 మోటార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని యంత్రాంగం నిర్ణయించింది.
News March 6, 2026
భూదాన్ భూముల పేరుతో మోసం..నలుగురి అరెస్ట్

ఖమ్మం వెలుగుమట్లలో భూదాన్ భూముల పేరుతో అమాయకులను మోసగించిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. ఓపీడీఆర్ సభ్యులమని నమ్మిస్తూ నిందితులు బల్లి శ్రీనివాస్, కోపెర వెంకన్న, కొట్టే బసు, సంపంగి వెంకటాచలం భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో అరెస్ట్ చేశామని, పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలిస్తున్నామని సీఐ పేర్కొన్నారు
News March 6, 2026
ఖమ్మం: దవాఖానాల్లో 99 రోజుల ‘స్పెషల్’ ప్లాన్!

ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చేందుకు వైద్యారోగ్య శాఖ నడుం బిగించింది. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా జిల్లావ్యాప్తంగా ‘99 రోజుల ప్రత్యేక కార్యాచరణ’ను ప్రారంభించినట్లు DMHO డా. రామారావు తెలిపారు. జూన్ 12 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో ఆసుపత్రుల్లో పేరుకుపోయిన చెత్త, పాత ఫర్నిచర్, కాలం చెల్లిన మందులను తొలగించాలని ఆదేశించారు. ప్రాంగణాలను ‘క్లీన్ & గ్రీన్’గా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు.


