News July 9, 2025
భద్రాచలం ఈవోపై దాడి ఖండించిన మంత్రి తుమ్మల

భద్రాచలం రామాలయ ఈవో రమాదేవిపై ఏపీలోని పురుషోత్తపట్నం వాసులు భూ ఆక్రమణదారులు దాడి చేయడాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖండించారు. ఈవోను ఫోన్‌లో పరామర్శించిన ఆయన ఈ ఘటన దురదృష్టకరమన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఆలయ భూముల విషయంలో ఇరు రాష్ట్రాలు చర్చించి దేవాలయానికి చెందేలా చర్యలు తీసుకుంటామని, ఆ భూములు దక్కితేనే ఆలయ అభివృద్ధి సాధ్యమని చెప్పారు.
Similar News
News July 9, 2025
తెలంగాణకు యూరియా కోత.. కేంద్రానికి ఎంపీ వంశీకృష్ణ లేఖ

తెలంగాణకు యూరియా కేటాయింపులు 45% తగ్గించడాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ బుధవారం తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖ రాశారు. రాజకీయ ప్రేరణతో బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధికంగా యూరియాను సరఫరా చేసి, తెలంగాణను ఉపేక్షించడం అన్యాయమన్నారు. RFCLలో తయారైన యూరియాను ముందుగా తెలంగాణకే కేటాయించాలన్నారు. రైతులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.
News July 9, 2025
10 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నాను: గోపాలకృష్ణ

ప్రకాశం జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ గొప్ప మనసు చాటుకున్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పీ-4 పథకంపై ప్రత్యేక అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కూడా 10 కుటుంబాలను దత్తత తీసుకోనున్నట్లు ప్రకటించారు. జిల్లాలో సుమారు 75 వేల బంగారు కుటుంబాలు ఉన్నాయని, వారికి మార్గదర్శకులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు.
News July 9, 2025
కృష్ణా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని డిగ్రీ 5, 6వ సెమిస్టర్ థియరీ (వన్ టైమ్ ఆపర్చునిటీ) పరీక్షల టైమ్ టేబుల్ విడుదలైంది. జులై 14 నుంచి 25 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని కేఆర్‌యూ వర్గాలు తెలిపాయి. 5వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 6వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. పూర్తి వివరాల కోసం https://kru.ac.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.