News September 6, 2024

భద్రాచలం ఎమ్మెల్యేపై నమోదైన కేసు కొట్టివేత  

image

భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావుకు ప్రథమ శ్రేణి కోర్టులో ఊరట లభించింది. 2018 ఎన్నికల సమయంలో ఆయనపై నమోదైన కేసును కోర్టు కొట్టేసింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన వెంకట్రావు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ ఓటర్లకు నగదు పంపిణీ చేయించారని కేసు నమోదైంది. వెంకట్రావుపై పట్టణ పోలీసులు ఏ-2గా చార్జిషీట్ ఫైల్ చేసి కోర్టులో కేసు వేశారు.

Similar News

News February 10, 2026

వైరా: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సీపీ నిఘా

image

వైరా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో CP సునీల్ దత్ మంగళవారం పట్టణంలో పర్యటించారు. ముందుగా వైరాలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను సందర్శించి, ఎన్నికల సామగ్రి పంపిణీ, భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సీపీ.. ఎన్నికల వేళ శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News February 10, 2026

నిబంధనల మేరకే విధులకు హాజరు కావాలి: సీపీ

image

ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో పోలీసు సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సీపీ సునీల్ దత్ ఆదేశించారు. మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్‌లో సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి, క్రమశిక్షణతో పనిచేసి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు. విధి నిర్వహణలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నియమ నిబంధనలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు.

News February 10, 2026

ఖమ్మం: దివ్యాంగులకు అలర్ట్.. దరఖాస్తుకు నేడే ఆఖరు!

image

దృష్టి, వినికిడి లోపం ఉన్న దివ్యాంగులు ఉపకరణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేడే చివరి రోజని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి వెల్పుల విజేత తెలిపారు. అర్హులు ఈ సాయంత్రంలోగా వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేయాలన్నారు. జిల్లాలోని దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గడువు దాటిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబోమని ఆమె స్పష్టం చేశారు.