News July 20, 2024
భద్రాచలం: ఐటీడీఏ కేంద్రంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐటీడీఏ కేంద్రంగా ప్రధాన సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులో 79952 68352 నెంబర్‌కు కాల్ చేయాలని ఐటిడిఏ అధికారులు పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమై మైదాన ప్రాంతాలకు రావాలని చెప్పారు. కంట్రోల్ రూమ్ నెంబర్ 24 గంటలు పనిచేస్తుందని వెల్లడించారు.
Similar News
News December 30, 2024
ICAR శాస్త్రవేత్తగా ఖమ్మం జిల్లా వాసి
తిరుమలాయపాలెం మండల పరిధి సుబ్లేడుకు చెందిన లత ఇటీవల జరిగిన నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్ (ICAR)పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. ప్లాంట్ పాథాలజీ (మొక్కల వ్యాధి అధ్యయన శాస్త్రం) విభాగంలో భారత వ్యవసాయ మండలి శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. పరిశోధనలు చేసి అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యమని లత అన్నారు.
News December 30, 2024
జాతరను తలపించేలా భద్రాద్రిలో ముక్కోటి ఉత్సవాలు
భద్రాద్రిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభమై 2025 జనవరి 20 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి సాంస్కృతిక ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నందున భక్తులు భారీగా తరలివస్తారని అంచనా వేస్తున్నారు. భద్రాద్రి రామయ్య దశావతారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాలు జాతరను తలపించేలా ఉండనున్నాయి.
News December 30, 2024
రైతులకు కొత్త రుణాలు ఇవ్వాలి: మంత్రి తుమ్మల
గతంలో వివిధ డీసీసీబీలలో కొన్ని తప్పులు జరిగాయని, పునరావృతం కాకుండా చూసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను హెచ్చరించారు. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(టీజీసీఏబీ) పని తీరు, ఆర్థిక అంశాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం సమీక్షించారు. రుణ మాఫీ కింద లబ్ధి పొందిన రైతులకు త్వరితగతిన కొత్త రుణాలు ఇవ్వాలని సూచించారు.