News February 19, 2025
భద్రాచలం చెక్‌పోస్ట్ వద్ద భద్రత పెంపు

భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి పాయింట్ వద్ద ఉన్న ఉమ్మడి చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు అదనపు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇటీవల గంజాయి స్మగ్లర్లు ద్విచక్ర వాహనంతో వాహనాల తనిఖీ చేస్తున్న ఓ పోలీస్ కానిస్టేబుల్‌ని వేగంగా ఢీకొట్టి పారిపోయాడు. ఇలాంటి ఘటనలు మరోమారు ఉత్పన్నం కాకుండా భద్రాచలం టౌన్ సీఐ రమేశ్ ఆధ్వర్యంలో తగు చర్యలు చేపట్టారు.
Similar News
News December 17, 2025
@9AM.. పోలింగ్ శాతం ఎంతంటే?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
★ వరంగల్: 22.26%
★ హనుమకొండ: 21.52%
★ ములుగు: 20.96%
★ భూపాలపల్లి: 26.11%
★ జనగాం: 22.51%
★ మహబూబాబాద్: 27.49%
➤ మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ జరుగుతుంది. మ.2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
News December 17, 2025
రూ.లక్ష రుణం పొందడానికి అర్హతలు ఏమిటి?

AP: కౌలు రైతులు రూ.లక్ష వరకు రుణం పొందాలంటే తప్పనిసరిగా సంబంధిత అధికారులు జారీ చేసిన కౌలు పత్రాలు కలిగి ఉండాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల పరిధిలో నివాసం ఉంటూ, వాటిలో సభ్యులై ఉండాలి. సొంత ఇల్లు ఉన్నవారికి ఈ రుణంలో ప్రాధాన్యత ఇస్తారు. కౌలు పత్రంలో సాగు చేసే భూమి ఎకరా కంటే తక్కువ ఉండకూడదు. రుణం పొందిన రోజు నుంచి ఏడాది లోపు అసలు, వడ్డీతో కలిపి రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించాలి.
News December 17, 2025
తిరుచానూరులో అంతా ఆయనే చేశాడు..?

తిరుచానూరు ఆలయంలో <<18505551>>అనధికారిక వ్యక్తుల <<>>గురించి Way2News వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. దీనిపై TTD విజిలెన్స్ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించింది. ఓ కీలక వ్యక్తి అండదండలతో ఇదంతా సాగిందని, గతంలో పని చేసిన పలువురు అధికారుల సైతం విచారణలో ఇదే చెప్పారని సమాచారం. ఆ వ్యక్తిపైనా విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. టీటీడీ ఉన్నతాధికారులు దీనిపై ఎప్పుడు చర్యలు ప్రారంభిస్తారో చూడాలి మరి.


