News April 9, 2025
భద్రాచలం డిపో ఆదాయం రూ.92.61 లక్షలు

భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం పురస్కరించుకుని భద్రాచలం డిపో పరిధిలో ఏప్రిల్ 5 నుంచి 7 వరకు వివిధ మార్గాలలో మొత్తం 78 ప్రత్యేక బస్సులు నడిపినట్లు డీఎం బి.తిరుపతి తెలిపారు. ఈ మూడు రోజుల్లో ప్రత్యేక బస్సులు మొత్తం రూ.1,52,188 కి.మీ పయనించగా రూ.92.61 లక్షల ఆదాయం డిపోకు లభించిందన్నారు. మొత్తం 82,138 మంది ప్రయాణించగా వారిలో 37,639 మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకున్నారని చెప్పారు.
Similar News
News December 18, 2025
కర్నూలు: ఫలితాలు విడుదల

కర్నూలు క్లస్టర్ యూనివర్సిటీ డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ ఫలితాలను ఇన్‌ఛార్జ్ వీసీ ఆచార్య వి.వెంకట బసవరావు బుధవారం విడుదల చేశారు. నవంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లో 3వ సెమిస్టర్‌కు 866 మంది హాజరవ్వగా 617 మంది ఉత్తీర్ణత(71.25%) సాధించారు. 5వ సెమిస్టర్‌లో 804 మంది పరీక్షలు రాయగా 709 మంది పాస్(88.18%) అయ్యారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.శ్రీనివాస్, ఎగ్జామినేషన్స్ డీన్ నాగరాజ్ శెట్టి ఉన్నారు.
News December 18, 2025
సకల జాతక దోషాలను నివారించే ఆలయాలివే..

కాళహస్తీశ్వర ఆలయం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి. కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య గుడిలోనూ సర్ప దోష నివారణ ఆచారాలు పాటిస్తారు. MHలో త్రయంబకేశ్వర్ ఆలయం ఈ దోష నివారణ పూజకు అత్యంత ముఖ్యమైనది. అలాగే మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర ఆలయం(ఉజ్జయిని), ఓంకారేశ్వర్ ఆలయాలు కూడా సకల దోషాలను తగ్గించే శక్తివంతమైన ప్రదేశాలుగా భావిస్తారు. ఈ క్షేత్రాలలో ప్రత్యేక పూజలు చేయడం ద్వారా జాతక దోషాల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.
News December 18, 2025
నీటి వసతి లేకుంటే పామాయిల్ సాగు వద్దు

ఆయిల్ పామ్ సాగును ఎలాంటి నేలల్లో చేపట్టినా నీటి వసతి ముఖ్యం. వర్షాధారంగా ఈ పంట సాగును చేపట్టలేము. అందుకే ఏ రైతైనా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పంట సాగు కోసం మొక్కకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా నీరు అందించి మంచి దిగుబడులను పొందవచ్చు.


