News April 6, 2025

భద్రాచలం: తలంబ్రాల కౌంటర్ల వద్ద భక్తుల కిటకిట

image

భద్రాచలం సీతారాముల కళ్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. దీంతో లడ్డూ ప్రసాదంతోపాటు మహా ప్రసాదం, స్వామివారి తలంబ్రాల కౌంటర్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అటు ఆలయ పరిసరాలతో పాటు పట్టణంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ పరిసరాల్లో పహారా కాస్తున్నారు.

Similar News

News April 7, 2025

సారపాకకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి మహాపట్టాభిషేకం వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సోమవారం సారపాక బీపీఎల్ ఐటీసీ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు స్వాగతం పలికారు. గవర్నర్ ఐటీసీ గెస్ట్ హౌస్‌కు చేరుకొని గౌరవ వందనం స్వీకరించారు.

News April 7, 2025

BREAKING: ఖమ్మం జిల్లాలో దారుణ హత్య

image

ఖమ్మం పట్టణంలోని నేతాజీనగర్‌లో దారుణ హత్య జరిగింది. ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన రవిప్రసాద్ నాలుగు నెలలుగా ఖమ్మంలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కాగా, అర్ధరాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో రవిప్రసాద్‌ను మహిళ నెట్టేసింది. గోడకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పభుత్వాస్పత్రికి తరలించారు.

News April 7, 2025

తల్లాడ: కాల్వలో గల్లంతైన మృతదేహం లభ్యం

image

ప్రమాదవశాత్తు సాగర్ కాల్వలో పడిన వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమయింది. ఎస్ఐ కొండలరావు తెలిపిన వివరాలు ప్రకారం.. తల్లాడ మండలం అన్నారుగూడెంకి చెందిన కటుకూరి జయరాజు(58) సాగర్ కెనాల్ గొడ్ల బ్రిడ్జి వద్ద కాళ్లు, చేతులు కడుక్కునేందుకు నీటిలో దిగాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడి కొట్టుకుపోయాడు. ఆదివారం గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకి తీసి కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

error: Content is protected !!