News March 22, 2025

భద్రాచలం పంచాయతీ ఆదాయం రూ.1.25 కోట్లు

image

భద్రాచలం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో శుక్రవారం వేలం పాట నిర్వహించగా ఆశీలు రూ.1.25కోట్లకు రంగా అనే కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. గోదావరి నదిలో బోట్లకి రూ.27.25 లక్షలు, చర్ల రోడ్డులో వారసంతకు రూ.3.80లక్షలు, మరో మూడు దుకాణాలకు 3.67లక్షలు పలికాయి. కాగా మరోసారి ఆశీలు టెండర్ దక్కించుకునేందుకు పాత గుత్తేదారు రూ.1.23 కోట్ల వరకు పాట పాడారు. వీటి ద్వారా ఏడాది జీపీకి అదనపు ఆదాయం రానుంది.

Similar News

News March 22, 2025

విశాఖ: పేద‌రిక నిర్మూల‌నకు పి-4 దోహ‌దం: కలెక్టర్

image

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన పి-4 విధానం పేద‌రిక నిర్మూల‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌ని, అధికారులు దానిపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించాలని జిల్లా క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. జిల్లాలోని పలు సంఘాల ప్ర‌తినిధులు, అధికారుల‌తో శ‌నివారం క‌లెక్ట‌రేట్‌లో స‌మావేశం నిర్వ‌హించారు. పి-4 విధానం ద్వారా పేద‌రిక నిర్మూల‌న సాధ్య‌ప‌డుతుందని, అంద‌రూ దీని ఆవ‌శ్య‌క‌త‌ను తెలుసుకొని భాగ‌స్వామ్యం కావాల‌న్నారు.

News March 22, 2025

మూడో దఫా నామినేటెడ్ పోస్టులపై కసరత్తు

image

AP: రాష్ట్రంలో మూడో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 21 ప్రముఖ దేవాలయాల పాలకమండళ్లు, 222 మార్కెట్ యార్డ్ కమిటీల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో పోస్టుకు 2-3 పేర్లు పరిశీలిస్తున్నారని, సీఎం చంద్రబాబు ఆమోదం తర్వాత ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఇప్పటికే సిఫార్సులు అందజేశారని వార్తలు వస్తున్నాయి.

News March 22, 2025

రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి: జేసీ

image

జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. వాటిని రైతులు వినియోగించుకోవాలని కోరారు. కందులకు రూ.7,550, శనగలకు రూ.5,650, మినుములకు రూ.7,400 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించామన్నారు. బహిరంగ మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని రైతులు విక్రయించి, ప్రభుత్వ కనీసం మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.

error: Content is protected !!