News October 12, 2025
భద్రాచలం: పాపికొండల పర్యాటకం పునః ప్రారంభం

జాతీయస్థాయిలో పేరుగాంచిన పాపికొండల విహార యాత్ర అధికారికంగా పునః ప్రారంభమైంది. ఏపీలోని రాజమండ్రి సమీపంలోని గండిపోచమ్మ ఫెర్రీ పాయింట్ నుంచి బోట్లు ఇప్పటికే శనివారం నుంచి ప్రయాణించాయి. కాగా, తెలంగాణ పర్యాటకుల కోసం ఏపీలోని పోచారం నుంచి కూడా బోట్లు ఈ వారంలోనే పునః ప్రారంభం కానున్నట్లు బోటు యజమానులు పేర్కొంటున్నారు. దీంతో పర్యాటక ప్రాంతంలో సందడి నెలకొంది.
Similar News
News October 12, 2025
FLASH: సిద్దిపేట: రిపోర్టర్ ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా కోహెడలో విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన వేల్పుల సంపత్ ఓ ప్రముఖ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. 6 రోజుల క్రితం కుటుంబ ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు యత్నించాడు. మెరుగైన వైద్య చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు.
News October 12, 2025
KNR: మోసం చేశాడంటూ యువతి సూసైడ్ అటెంప్ట్

ప్రేమించి మోసం చేశాడంటూ ప్రియుడి ఇంటి ముందే ఓ యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హుజూరాబాద్‌కు చెందిన వినోద్‌తో జగిత్యాలకు చెందిన యువతి కొంతకాలంగా ప్రేమలో ఉంది. ఈ క్రమంలో తనకు వేరే యువతితో తనకు పెళ్లి నిశ్చయమైందని, ఇకపై తమ సంబంధానికి స్వస్తి పలుకుదామని ప్రియుడు చెప్పడంతో ఆవేదన చెందిన బాధిత యువతి ఆదివారం అతడి ఇంటికి వెళ్లి సూసైడ్ అటెంప్ట్ చేసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 12, 2025
తెలంగాణ అప్డేట్స్

* కొండా దంపతులు, పొంగులేటి శ్రీనివాస్ వివాదంపై CM రేవంత్ సీరియస్.. మేడారం పనులు పూర్తి చేయాలని ఆదేశం
* జూబ్లీహిల్స్ BJP అభ్యర్థిగా దీపక్ రెడ్డి ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం
* యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం
* గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీకాంత్ భరత్‌పై చర్యలు తీసుకోవాలని ‘మా’ అధ్యక్షుడు విష్ణుకు MLC బల్మూరి వెంకట్ విజ్ఞప్తి