News October 28, 2025

భద్రాచలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సబ్ కలెక్టర్

image

‘మొంథా’ తుపాను హెచ్చరికల నేపథ్యంలో భద్రాచలం ఏజెన్సీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట సూచించారు. నేటి నుంచి 30 వరకు అనవసర ప్రయాణాలు మానుకోవాలన్నారు. ప్రజలు స్థానిక అధికారులకు సహకరించి, భద్రతా చర్యలు పాటించాలని కోరారు. తుపాను నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Similar News

News October 28, 2025

రేవంత్ రెడ్డిని ప్రజలు క్షమించరు: కవిత

image

TG: మహబూబ్‌నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని, ఆయనను ప్రజలు క్షమించరని కల్వకుంట్ల కవిత విమర్శించారు. ‘జనంబాట’లో భాగంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన కరివెన రిజర్వాయర్‌ను ఆమె పరిశీలించారు. కేసీఆర్ హయాంలోనే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు 80% పూర్తయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఫైరయ్యారు.

News October 28, 2025

పల్నాడు జిల్లా రైలు మార్గాల మీద సీఎం సమీక్ష

image

పల్నాడు జిల్లా మీదగా వెళ్లే రైలు మార్గాల మీద సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ప్రధానంగా 3.4 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం నిర్మించనున్న హైదరాబాద్- చెన్నై కారిడార్‌పై సమీక్షించారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ట్రైన్ మార్గం పల్నాడు జిల్లాలో 81కిలోమీటర్ల మేర నిర్మించాల్సి ఉంది. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వే పనులపై కార్యాచరణ వేగవంతం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

News October 28, 2025

నేర నియంత్రణలో సాంకేతికత కీలకం: ఖమ్మం సీపీ

image

ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో సిటీ ఆర్ముడ్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆన్‌లైన్ “ఓపెన్ హౌస్” మంగళవారం నిర్వహించారు. పోలీసులు వినియోగించే ఆధునిక సాంకేతిక పద్ధతులు, ఫింగర్‌ప్రింట్ యూనిట్, బాంబ్ డిస్పోజల్, సైబర్ నేరాలను పసిగట్టే విధానాలు విద్యార్థులకు చూపించారు. డాగ్ స్క్వాడ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. సీపీ మాట్లాడుతూ.. సాంకేతికతతోనే నేర నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.