News March 26, 2025
భద్రాచలం: ప్రమాదంలో.. ఇద్దరు మేస్త్రీలు, నలుగురు కూలీలు మృతి?

భద్రాచలంలో ఆరంతస్తుల భవనం కుప్పకూలగా, ఆరుగురు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఇందులో భద్రాచలానికి చెందిన తాపీ మేస్త్రీలు ఉపేంద్ర, కామేష్‌లు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మిగతా వారు అడ్డా కూలీలు కాగా, వారి వివరాలు తెలియాల్సి ఉంది. కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
Similar News
News March 29, 2025
తుది శ్వాస వరకు కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేస్తా: శేరి సుభాష్ రెడ్డి

ఎమ్మెల్సీగా ఆరేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా శేరి సుభాష్ రెడ్డి శనివారం ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఉద్యమ ఆరంభం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్న తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం పట్ల హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తుది శ్వాస వరకు కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేస్తానని సుభాష్ రెడ్డి అన్నారు.
News March 29, 2025
భూకంపం.. 1644 మంది మృతి

మయన్మార్ భూకంప మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 1644 మంది మరణించారని ఆ దేశ అధికారులు వెల్లడించారు. వేలాది మందికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. కాగా మృతుల్లో భారతీయులు ఎవరూ లేరని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
News March 29, 2025
రేపు, ఎల్లుండి పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు

TG: రేపు, ఎల్లుండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. LRS ఫీజు మార్చి31లోపు చెల్లించిన వారికి 25శాతం రాయితీ వర్తిస్తుందని రిజిస్టేషన్ శాఖ తొలుత ప్రకటించింది. అయితే 30, 31 సెలవుదినాలు కావడంతో చెల్లింపులు జరపలేకపోతున్నామని ప్రజల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో సెలవులను రద్దు చేసింది.