News March 4, 2025

భద్రాచలం బిడ్డకు అత్యున్నత పదవి..!

image

భద్రాచలం సీనియర్ న్యాయవాది జెట్టి సాల్మన్ రాజుని తెలంగాణ హైకోర్టు ఏజీపీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న సాల్మన్ రాజు సోమవారం హైకోర్టు ఏజీపీగా నియమితుడై హైకోర్టు అడిషనల్ జనరల్ రంజిత్ రెడ్డి చేతులు మీదుగా నియామక పత్రాన్ని స్వీకరించారు. భద్రాచలం న్యాయవాది హైకోర్టు ఏజీపీగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Similar News

News January 10, 2026

కామారెడ్డి: మంజీరాలో వ్యక్తి గల్లంతు

image

మంజీరా నదిలో నాణేల కోసం వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతైన ఘటన బొల్లక్‌పల్లిలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సాయిలు (42) అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం మంజీరా నది వద్దకు వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబీకులు గాలింపు చేపట్టారు. నది ఒడ్డున అతడి బట్టలు, సెల్‌ఫోన్‌ లభ్యమయ్యాయి. దీంతో మంజీరా నదిలో గాలింపు చేపట్టారు.

News January 10, 2026

బహు భర్తలు గల పురాణ స్త్రీలు

image

పురాణాల్లో కొందరు స్త్రీలకు బహు భర్తలున్నారు. శుక మహర్షి కోడలు ‘కీర్తిమతి’, నితంతుని కుమార్తె ‘అజిత’ ఐదుగురు అన్నదమ్ములను వివాహం చేసుకున్నారు. ‘మారిష’ 11 మంది ప్రచేతసులను, గౌతమ వంశానికి చెందిన ‘జటిల’ ఏడుగురు ఋషులను పతిగా పొందింది. ఈ గాథల వెనుక ఆధ్యాత్మిక రహస్యాలు, ధర్మ సూక్ష్మాలు దాగి ఉన్నాయి. వీటిని కేవలం ప్రాపంచిక కోణంలో కాకుండా, ఆయా యుగ ధర్మాలు, భగవంతుని లీలావిశేషాలుగా అర్థం చేసుకోవాలి.

News January 10, 2026

పేకాట, కోడిపందాలు ఆడితే జైలుకే: ఎస్పీ

image

సంక్రాంతి పండుగ వేళ పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా నిఘా ఏర్పాటు చేశామని, ఏపీ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో గస్తీని ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ రవాణా, జూదంపై నిరంతరం వాహన తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కచ్చితంగా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.