News March 21, 2024
భద్రాచలం బ్రిడ్జి పైనుంచి దూకి సూసైడ్

భద్రాచలం బ్రిడ్జి పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఈ ఉదయం జరిగింది. పాల్వంచ వనమా కాలనీకి చెందిన తంగెళ్ల శేషం రాజ్ బ్రిడ్జి పైనుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News February 28, 2026
వెలుగుమట్లలో బాధితులపై సర్వే కొనసాగుతోంది: కలెక్టర్

ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో భూదాన్ భూముల ఆక్రమణల తొలగింపులో ఇళ్లు కోల్పోయిన వారి సామాజిక-ఆర్థిక సర్వే ముమ్మరంగా కొనసాగుతోందని అనుదీప్ దురిశెట్టి శనివారం తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాకు చెందిన 522 మంది, ఇతర జిల్లాలకు 107, ఇతర రాష్ట్రాలకు ముగ్గురిని గుర్తించారు. సర్వే పూర్తయ్యాక అర్హులకు నివాస స్థలం, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. సంబంధితులు సర్వేకు సహకరించాలని కోరారు.
News February 28, 2026
ఖమ్మం: అదనపు కలెక్టర్‌కు తీన్మార్ మల్లన్న వినతి

భూదాన్ భూముల బాధిత కుటుంబాలకు అదే భూమిలో పునరావాసం కల్పించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని కోరారు. శనివారం తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్‌ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. తక్షణ సహాయం కింద ప్రతి బాధిత కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాలని కోరారు. భూదాన్ భూముల విషయంలో పేదలపై మాత్రమే చర్యలు తీసుకోవడం అన్యాయమని లేఖలో ప్రస్తావించారు.
News February 28, 2026
ఖమ్మం: పేరుకు మాత్రమే పేదల పార్టీ: ఈటల

కనికరం లేకుండా పేదల ఆవాసాలను కూల్చివేసి తప్పు జరిగినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా బాధితులకు క్షమాపణ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పేదలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ఈ పార్టీ పేరుకు మాత్రమే పేదల పార్టీ అని చేతల్లో మాత్రం రాక్షస పార్టీ అని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని, కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. లేకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు.


