News February 12, 2025

భద్రాచలం రాములవారి పెళ్లికి గజ్వేల్ నుంచి తలంబ్రాలు..

image

శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణం కోసం వాడే గోటి తలంబ్రాల(గోటితో వలిచిన బియ్యం)ను వలిచే అవకాశాన్ని ఈసారి గజ్వేల్‌లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థకు భద్రాచల దేవస్థానం కల్పించింది. ఈ మేరకు 250కిలోల వడ్లను గోటితో వలచి తలంబ్రాలుగా మలచనున్నారు. ఈ మహత్కార్యంలో పాల్గొనే అవకాశం వచ్చిన శ్రీరామకోటి భక్త సమాజం సభ్యులు రామారాజును ఎమ్మెల్సీ యాదవరెడ్డి బుధవారం సన్మానించి అభినందించారు.

Similar News

News February 21, 2026

MHBD: రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు అనుష్క

image

జిల్లా స్థాయి ఖోఖో పోటీల్లో కంటాయపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.అనుష్క ప్రతిభ చాటింది. 6వ తరగతి చదువుతున్న అనుష్క తన అత్యుత్తమ ప్రదర్శనతో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు HM ప్రభాకర్ తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థిని క్రీడల్లో రాణించి రాష్ట్రస్థాయికి ఎంపికవడం పట్ల ఉపాధ్యాయులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెను ఘనంగా అభినందించారు.

News February 21, 2026

అథ్లెటిక్స్‌లో సిద్దిపేట జిల్లాకు రెండు పతకాలు

image

హనుమకొండలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట క్రీడాకారులు సత్తా చాటారు. రెండో రోజు జిల్లాకు చెందిన ఇద్దరు పతకాలు సాధించినట్లు కోచ్ వెంకటస్వామి తెలిపారు. అండర్-16 బాలుర షాట్‌పుట్ విభాగంలో చేర్యాల మోడల్ స్కూల్ విద్యార్థి ప్రణయ్ కుమార్ వెండి పతకం సాధించగా, బాలికల 100 మీటర్ల హర్డిల్స్‌లో చింతమడక కేవీఆర్‌ఎస్ జెడ్‌పీహెచ్ఎస్ విద్యార్థిని చక్రిక కాంస్య పతకం కైవసం చేసుకున్నారు.

News February 21, 2026

VZM: డ్రైవింగ్ శిక్షణలో లోపాలు బట్టబయలు

image

విజయనగరం జిల్లాలోని డ్రైవింగ్ స్కూళ్లపై రవాణాశాఖ శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. నిబంధనలు పాటించకపోవడం, సరైన పత్రాలు లేకపోవడం, అర్హతలేని శిక్షకులతో శిక్షణ ఇవ్వడం వంటి లోపాలు గుర్తించారు. దీంతో 3 డ్రైవింగ్ స్కూళ్ల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు. మరికొన్నింటికి షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరారు. రోడ్డు భద్రత కోసం నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.